22, ఏప్రిల్ 2009, బుధవారం


తపము లేనిదె యెన్నరే నెపము లెల్ల!

By kadambari piduri, Apr 5 2009 4:53PM

"ఆంధ్ర రత్న" బిరుదు కల దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు. కోదండ రామయ్య, సీతమ్మ దంపతులకు పుణ్య ఫలముగా పుట్టిన గోపాల క్రిష్ణయ్య "రామ దండు" సమర దళమును నిర్మించి,స్వాతంత్ర్యసయుద్ధములో తన క్రియా శీలతను నిరూపించుకొనిన ధీశాలి. అంతేకాదు! ఆయన గాయకుడు, రచయిత కూ డా! ఆ దుగ్గిరాల వారి రచనలలో ఒక వ్యంగ్య సీస పద్యమును చూడండి. 

కొండెంకటప్పన్న గుండు సున్న గదన్న 
     గోపాల కిట్టాయి కొక్కిరాయి 
టంగుటూరు ప్రకాశ మింగిలీసు పిశాచి 
     నాగేశ్వరుడు వట్టి నాగ జెముడు 
పట్టాభి సీతన్న తుట్టె పురుగు గదన్న 
     ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు 
గొల్ల పూడ్వరన్న కళ్ళు లేని కబోది 
     బులుసు సాంబడు వట్టి పుట్టు కుంక 
అయ్యదేవర గాడు పెయ్య నాకుడు గాడు 
     అయ్యంకి రమణయ్య దయ్యమయ్య 
డాక్టర్ సుబ్రహ్మణ్య మాక్టింగ్ పులిష్టాపు 
     దువ్వూరి సుబ్బమ్మ దృష్టి బొమ్మ 



తే.అనుచు పల్కుదు రాంధ్రుల నవని యందు 
గాంధి శ్రేష్ఠుని మతములో గలిసి నపుడు 
తపము లేనిదె యెన్నరే నెపము లెల్ల 
రామ నగరీ నరేంద్ర! శ్రీ రామచంద్ర! 


ఈ శతక పద్యము తొలి భాగము చదవగానే "ఇది తిట్టు కవిత్వము కామోసు!" అని అనిపిస్తుంది. "గాంధి మహాత్ముని"మతములో చేరినపుడు అందరూ అలాగ అనుకొన్నారనగానే,ఆ రచనలోని చమత్కారము చదువరికి నవ్వు తెప్పిస్తుంది. 

నేటి ఎన్నికల ప్రచారము హోరు గమనించండి. దూషణ భూషణ తిరస్కారములతో, తిట్టు
 పురా


నేటి ఎన్నికల ప్రచారము హోరు గమనించండి. దూషణ భూషణ తిరస్కారములతో, తిట్టు పురాణములతో దద్దరిల్లి పోతూన్నది వాతావరణము. ఈ సందర్భములో పైన పేర్కొన్నట్టి పద్యము గుర్తుకు తెచ్చుకున్నాను! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి