22, ఏప్రిల్ 2009, బుధవారం


పూవు

By kadambari piduri, Apr 10 2009 8:19AM
పూవూ!పూవూ!అవ్వాయ్ తువ్వాయ్! 
సుతి మెత్తని సుతారమీవు // 

మెత్తని నవ్వువు నువ్వు 
తావిని ఎడదను హత్తు కొందువు// 

రంగుల నద్ది, రేకు రేకును 
తురగము చేసి 
వెన్నెల తేరుకు, బహుమానం 
ఇచ్చిన దాతవు నువ్వు // 

బాలల జగతికి నీవే 
ఊహల సారధి వైనావే! 
కవి భావాలను నువ్వే 
దౌడును తీయిస్తావు //

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి