22, ఏప్రిల్ 2009, బుధవారం

Recipes

మా అమ్మమ్మ, తాతయ్య వంటి వాళ్ళు ఆ రోజులలో పల్లెటూరులలో ఆయుర్వేద వైద్యము,చిట్కా వైద్యాలను చేసే వారు. పైసా పుచ్చుకోకుండా పల్లె జనులకు పంచాంగము, ముహూర్తములు చెప్పుట, ఉచిత సలహాలు ఇచ్చేవారు. వారి సేవలను ఈ రోజులతో పోల్చి చూస్తే ,లక్షాధికారులై ఉండే వారేమో ననిపిస్తుంది. వారు ఇప్పుడు లేరు, కానీ వారు ఆ యా సందర్భాలలో అనుసరించిన చిట్కాలను గుర్తు ఉన్నంత వరకూ చెప్పే ప్రయత్నము ఇది. 

జలుబు తగ్గేందుకు చిట్కా: 

అల్లము రసము - చెంచాడు 
తమలపాకుల రసము - రెండు చెంచాలు 
తేనె - రెండు చెంచాలు 

ఈ మూడిట్నీ కలపాలి. ఈ రసముల మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి త్రాగాలి. త్రాగిన వెంటనే ఒక చెంచాడునీళ్ళు తాగాలి. ఇలా చేస్తే పడిశము నుండి కొంత ఉపశమనము లభిస్తుంది. 

డాక్టరు దగ్గరికి వెంటనే వెళ్ళేందుకు వీలు కుదరనప్పుడు, ఇలాటి చిట్కాలు ఆపద్ధర్మముగా ఉపకరిస్తాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి