22, ఏప్రిల్ 2009, బుధవారం

గంధర్వ గానాలు!

By kadambari piduri, Mar 8 2009 7:36PM

పల్లవి 

ఏడు కొండలమీద అచ్చట 
తిరు నగరిలోన ఇచ్చట 
నెలతల దరహాస వల్లరి 
సుమ కోమలం తావులు పరి వ్యాప్తి 

అను పల్లవి 

అచ్చటలు ముచ్చటలు 
లోకాభి రామాయణం 
సిరి సిరీ! సిరి సిరీ! సిరి సిరీ! 

అల మంగ తాయారు 
వడి వడి తయ్యారు 
భద్రంగ ఉన్నదా? ఓరుగల్లు!?! 
గబగబా, గబగబా, గబగబా! 

వెంకన్న మది రాణి 
భూదేవి నడువుమా! 
అడుగులేస్తేనే ధరణి కందేనా!?! 
వడివడిగ, వడివడిగ 
త్వరగ, త్వరగా! 

తేరు రానే వచ్చెనో యమ్మలారా! 
పట్టు కుబుసాల కుచ్చిళ్ళలో 
సరిగంచ మడతల రెప రెపలలో 
మీ కంటి రెప్ప పాటులు 
టప టపా, టపటపా, టపటపా! 

కోరస్ 

మీ ఈ చిరునవ్వు సందడులు గలగలా! 
గలగలా, గలగలా, గలగలా! 
సరి సరీ! గబగబా! వడివడీ! త్వరత్వరగలూ 
ఇన్నిన్నిగానూ, ఈ మేళవింపులే 
గంధర్వ గానాలు! సన్నాయి మేళాలు ! 
పిప్పి ప్పి! డుమ్ డుమ్! 
పిప్పి ప్పి, డుమ్ డుమ్!!
Views (8

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి