22, ఏప్రిల్ 2009, బుధవారం

పాపిటిబిళ్ళలు

By kadambari piduri, Apr 17 2009 5:22PM
కమ్మని వానొచ్చింది 
ఘుమ్మని భువి గుబాళించె.// 
మెరుపు దార హారాలు 
దేవ కన్యకల చేతుల 
పొరపాటున జారినవో?! 
వర్ష బిందు రత్న మణులు 
జల జల జల రాలిన విటు.// 
గడ్డి పూల తలల పైన 
పాపిటి బిళ్ళలు ఐనవి 
బుల్లి వర్ష బిందువులు. 
గంతులేస్తు, చిందులేస్తు 
పిల్లలు ఫక్కున నవ్విరి. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి