22, ఏప్రిల్ 2009, బుధవారం

నాయని జలతరంగిణి

By kadambari piduri, Apr 20 2009 1:08PM
నాయని సుబ్బారావు గారు హైదరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ ఇంటి యజమానురాలి పేరు "దమయంతి ప్రతి రోజు మాదిరిగానే రోజూ, మున్సిపాలిటీ పంపు ద్వారా నీళ్ళు వచ్చినప్పుడే, అందరూ నీళ్ళను పట్టుకో వాల్సి వచ్చేది. యధా ప్రకారం బిందెలతో, కడవలతో అక్కడి పోర్షన్లలో నివసించే వాళ్ళు జల యజ్ఞ సాధన కొరకై వచ్చి ఉన్నారు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు మంచి నీళ్ళు పట్టు కుంటున్నారు. ఇంతలో నెమ్మదిగా owner దమయంతి వస్తూంటే, అందరూ ఆమెను పలకరించారు. నాయని అన్నారిలాగ, చమత్కారంగా "నల్లా మహారాజు కోసరం దమయంతి వస్తున్నారు." పంపు, కొళాయి, కుళాయి, నల్లా ఇత్యాది పర్యాయ పదాలలో, ఆ జల వాహకమును తెలంగాణా జిల్లాలలో "నల్లా"అని అంటారు. 

దమయంతి వస్తున్నారు." పంపు, కొళాయి, కుళాయి, నల్లా ఇత్యాది పర్యాయ పదాలలో, ఆ జల వాహకమును తెలంగాణా జిల్లాలలో "నల్లా"అని అంటారు. 

అదీ సంగతి. కవి గారి సొగసైన శ్లేషకు ఇలాగ అవకాశం దొరికింది.
Views (9)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి