22, ఏప్రిల్ 2009, బుధవారం

ఆనందో కృష్ణ!

By kadambari piduri, Mar 30 2009 2:05PM


ప్రముఖ సంచలన పత్రిక "కృష్ణా పత్రిక"కు సంపాదకులు"శ్రీ ముట్నూరి కృష్ణా రావు. ఆయన ప్రతి రోజూ ఉదయము తోటలో్ పచారులు చేస్తూ, ప్రకృతికి సన్నిహితంగా గడిపే వారు. 

మధ్యాహ్నం సంపాదకీయాలను సమగ్రంగా రచించడములో తలమునకలయ్యేవారు. సాయంత్రము స్నేహితులతో సంగీత చతురోక్తులతో హాయిగా కాలక్షేపము చేసేవారు. 

మిత్రులు ఇలా చనువుగా అనేవారు "కృష్ణా రావు గారు ఉదయం పూట 'తోటానందులు,'మధ్యాహ్న వేళల్లో 'వేటానందులు', సాయంత్రం పూట 'ఆటానందులు, పాటానందులు'." 

ముట్నూరి కృష్ణా రావు గారిని ఆనందో బ్రహ్మ!...కాదు! కాదు! ఆనందో కృష్ణ! అందామా?! 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి