22, ఏప్రిల్ 2009, బుధవారం

గాలిపటాలు

By kadambari piduri, Mar 10 2009 6:12PM
సంకురాతిరిల సంబరాలు 'ఇల'!(=భూమి) 
గాలి పటాలు,వన్నెలు విరియగ 
నీలాఅల నింగినీ ఎగరేనండీ! 
ఇలా.....ఇలా....... 
అలా,అలా,ఆలాగున! // 

1)గగన మంత తన రాజ్యమంట! 
అచటా అచట ,అచటంతా 
అంతట తనే అయి చెలరేగేను // 

2)అటు ఊగును,ఇటు ఊగును 
అందందున తారాడును 
తారలనే వెక్కిరించు'కొక్కిరాయి' 
ఈ పతంగి // 

3)అంబరమున నడయాడును 
నడక కాదు! నాట్యము అది! 
మబ్బులను కొక్కిరిస్తు, 
రొక్కించే రాలు గాయి 
ఈ పతంగి //
Views (33) | P

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి