6, మే 2016, శుక్రవారం

నా మొదటి పోస్టు & మాణిక్య వీణ

నా మొదటి పోస్టు " #అఖిలవనిత.blog లో ;-

 శ్రావణ మేఘమ్ములార!
వర్షించే మబ్బులారా! 
కుప్పతెప్పలౌతూన్నవి 
జలబిందు ధారలు!
;  
మీ హృదయ కుహరముల  
ఆ అశ్రురాశులను దాచుకోండి!

నా కన్నుదోయిలోన 
ఆ బాష్పములకు 
ఉప్పతిల్లుచు పొరల 
జన్మ నిచ్చెదను!    
'పునర్జన్మ 'నొసగెదను, 
           దిగులు వలదు, వలదింక!
             ఓ నీరదములార!
************************************,

             [ Tuesday, March 10, 2009
                      శ్రావణ మేఘములారా! ]
************************************,
;
                  అవ్యక్తం!

కలనూపుర రవళిమ అవ్యక్తం!
ఉదయారుణిమ ప్రాగ్ దిశ నవ్యక్తం!
చెలి పెదవిని హాసం అవ్యక్తం! 
మృదువీణగ మారెను నా హృదయం!

==================================,
;
                awyaktam!

kalanuupura rawaLima awyaktam!
udayaaruNima praag diSa nawyaktam!
cheli pedawini haasam awyaktam! 
mRduweeNaga maarenu naa hRdayam!
;

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి