18, మే 2016, బుధవారం

నేడు వింత జరిగెను!

తటాకమ్ముల చిరు తరగలు ; 
తటాలున  నేర్చినవి ; 
ఆటపాట లెన్నెన్నో! 
ఎటుల, ఎటుల? తెలుపండీ!
 ఇటుల - 
           ~  నేడు వింత జరిగెను!    ||  
;
తరంగములు మృదురాగిణి
 + లయ్యినవీ ఓహోహో!  
తరగ తంత్రు పయిన 
గాలి మృదు స్పర్శలు పాటలయీ - 
హొయలు లొలకబోసేను! 
           ~  నేడు వింత జరిగెను!    ||  
;
తరగమడత తారళ్యత ; 
వెన్నెలను పిలిచేను ; 
తీరమ్ముల సైకతముల
అనురాగపు చలనమ్ములు -  
లక్ష హంస తూలికలై ; 
నవ చిత్రమ్ములను తీర్చి వేసెను! ||
;
ప్రకృతిలో - అణువు అణువు ; 
ప్రణయ పాన్పు ఆయెను! 
           ~  నేడు వింత జరిగెను!    || 
;
చిలుక వాహనుడు మదనుడు ; 
శుకము వీడి తురగమెక్కె! 
'ఛల్ ఛల్!' అంటూ : 
బాగ హల్ చల్ చేస్తుండెను! 
           ~  నేడు వింత జరిగెను!    ||  
;
నవ్య ప్రేమజంటలకు ; 
మోహనమౌ మోహ-రంగమందున ; 
కదన రంగమును ఏర్పరచెను అతనుడు;
           ~  నేడు వింత జరిగెను!    || 
;
సమ్మోహనకరముగాను గుంభనముగ నవ్వేను 
పతి నగవుల పారిజాత సుమములన్ని
కూర్చి దండలల్లి
తన గళమున ధరియించీ
అల్లిబిల్లి మేల్మి ఆటలాడేను;
           ~  నేడు వింత జరిగెను!    || 

****************************\****,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి