8, డిసెంబర్ 2016, గురువారం

వీడ్కోలు

తాళ లేని పున్నమికి ; 
కర్పూర విడెమిచ్చి ; 
వేళ కాని వేకువకు ; 
మలి వీడ్కోలును పలికి : || 

చెలి జడలో మొగలి పూవు తావిని ; 
నేనై ఉందును ; 
ఉందును నేనిచటనే, 
సదా సదా, నిరంతరం ;  || 

రాధ జడ పరిమళాల తరాజు ; 
తుమ్మెదల కూడలి అయె ; 
రాధ కేశ వేదిక ;  || 

ఏమని చెప్పుదును ; 
తక్కిన పుష్పాల వేదనలు ; 
భ్రమరము లన్నియు చేరిన 
సీమ ఇదే ఆయెను - అని ; 

తమ వంకకు అవి 
    రావడమే మరిచినవని - 
తక్కిన పూవులు అన్నింటీ ; 
విలవిలలు, కృంగి కృశించుటలు ;  || 

==============================;
;
          weeDkOlu

tALa lEni punnamiki ; 
karpuura wiDemichchi ; 
   wELa kaani wEkuwaku ; 
mali weeDkOlunu paliki : || 
cheli jaDalO mogali puuwu taawini ; 
nEnai umdunu ; 
umdunu nEnichaTanE, 
sadaa sadaa, niramtaram ;  || 
raadha jaDa parimaLAla taraaju ; 
tummedala kuuDali aye ; 
raadha kESa wEdika ;  || 
Emani cheppudunu ; 
takkina pushpaala wEdanalu ; 
bhramaramu lanniyu chErina 
seema idE Ayenu - ani ; 
tama wamkaku awi 
    raawaDamE marichinawani - 
takkina puuwulu annimTii ; 
wilawilalu, kRmgi kRSimchuTalu ;  || 

***********************,
 ;-  [ పాట 111 ;  బుక్ పేజీ 115  , శ్రీకృష్ణగీతాలు ] 
;  

1 కామెంట్‌: