10, అక్టోబర్ 2016, సోమవారం

మేదినికి నిశి సేవలు

గగన దుర్గమున ; 
      జొరబడినవి చుక్కలు! 
ఆహా! ఔను కదా! 
       నేడు అమవస్య! 
;
చీకటి సంపెంగ నూనె 
      దోసిళ్ళలోన నిండుగా ; 
తెచ్చినది నీలినింగి ; 
మేదినీతలమునకు ప్రేమ మీర ; 
అభ్యంగన స్నానాలను ; 
చేయించును స్వయంగా! 

ఇన్ని తంతులిన్ని 
    తతంగములు 
ఇన్నిన్ని ఎడతెరిపి లేని సేవలను ; 
చేస్తూన్నది అంబరం ; 
;
వసుంధరకు సదా జరుగు 
ఉపచారం శుశ్రూషలు ; 
నిత్య శ్రీమంతమ్ములు, 
ఎల్లరికీ హర్షమ్ములు, 
ఔను కదా ఓ అమ్ములూ!! 
;
&&&&&&&&&&&&
భూరి కవిత -   ;- ;
============================  ;
;
                     mEdiniki niSi sEwalu ;- 
;
gagana durgamuna ; 
     jorabaDinawi chukkalu! 
aahaa!aunu kadaa! 
         nEDu amawasya! 
;
cheekaTi sampemga nuune 
      dOsiLLalOna nimDugaa ; 
techchinadi neelinimgi ; 
mEdiniitalamunaku prEma meera ; 
abhyamgana snaanaalanu ; 
chEyimchunu swayamgaa! 

inni tamtulinni 
    tatamgamulu 
inninni eDateripi lEni sEwalanu ; 
chEstuunnadi ambaram ; 
;
wasumdharaku sadaa jarugu 
upachaaram SuSrUshalu ; 
nitya SrImamtammulu, 
ellarikii harshammulu, 
aunu kadA O ammuluu!!
;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి