10, అక్టోబర్ 2016, సోమవారం

ఏకలవ్య శిష్యుడైన గాలి!

చిరు గాలి ఇంత 
నేర్పు నెపుడు ఆర్జించెనో! 
నేత పని యందున 
చిరుగాలి ఇంత ప్రజ్ఞ ; 
నెపుడు పొందెనో ఏమో!? ||
;
ఈ మంద సమీరమ్ము 
పుష్పమ్ముల మరందముల ; 
ప్రోగు చేసె నిమ్మళముగా! ; 
నెమ నెమ్మది మీద నేసె ; 
మకరంద కోటి వర్ణ 
      రత్న కంబళములను! ;  || 
;
తెలిసినదీ రహస్యం ;
మారినది చిరుగాలి 
ఏకలవ్య శిష్యునిగా! ;  .........   
;
లలన లేత నగవుల లావణ్యములను ; 
ముగ్ధ మేను నిధి ఐన తారుణ్యతను , 
ఎంచుకొనెను ఈ గాలి ; 
మారినది చిరుగాలి 
ఏకలవ్య శిష్యునిగా! ; 

మందస్మిత తరళ స్పర్శ ; 
మందగమన పద ముద్రల ; 
అనుసరణల ఆనందం ; 
రవ్వంత తాకినంతటనే ; 
తటపటాయింపు లేని ; 
నేర్పరి ఆయెను గాలి; 
;
అందులకే, 
ప్రకృతి - 
ధరియించ గలిగినది 
    ఇన్ని వన్నె పుట్టములను! 
;
ఓహోహో! చిరుగాలీ! 
ఓ మలయ పవన వీచికా!! 
అందుకొనుమ జోహార్లను! 
అందుకో మా జోహార్లు! 

@@@@@@@@@@@@@
;
భూరి కవిత -   ;- అవుతున్నాడు రాజు  ;

============================  ;
;
                   Ekalawya SishyuDaina gaali!
;
chiru gaali imta nErpu 
      nepuDu ArjimchenO! 
nEta pani yamduna 
chirugaali imta praj~na ; 
nepuDu pomdenO EmO!? ||
;
ii mamda sameerammu 
pushpammula maramdamula ; 
prOgu chEse nimmaLamugaa! ; 
nema nemmadi meeda nEse ; 
makaramda kOTi warNa 
       ratna kambaLamulanu ;  || 
;
telisinadii rahasyam ;
maarinadi chirugaali 

Ekalawya Sishyunigaa! ;  .........   
lalana lEta nagawula laawaNyamulanu ; 
mugdha mEnu nidhi aina taaruNyatanu , 
emchukonenu ii gaali ; 
maarinadi chirugaali 
Ekalawya Sishyunigaa! ; 

mamdasmita taraLa sparSa ; 
mamdagamana pada mudrala ; 
anusaraNala aanamdam ; 
rawwamta taakinamtaTanE ; 
taTapaTAyimpu lEni ; 
nErpari aayenu gaali; 
;
amdulakE, 
prakRti - 
dhariyimcha galiginadi 
    inni wanne puTTamulanu! 
;
OhOhO! chirugaalI! 
o malaya pawana weechikaa!
amdukonuma jOhaarlanu! 
amdukO maa jOhaarlu! 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి