10, అక్టోబర్ 2016, సోమవారం

జలపాత గురువులు

జలపాతములలోన తూగు 
లయబద్ధతలు చూడు!
;
నిస్తబ్ధ ప్రకృతికి 
నాట్యాలు నేర్పేటి 
బోధ గురువులు అవ్వి!
;
లోహ ఝిల్లీ పరికరమ్ములు 
 ఆ ఉరికేటి ఝరులందు
  తొణుకించు సరి కొత్త రాగ వాహినుల! 

కంచు తాళమ్ముల కరముల పుచ్చుకుని
శ్రుతికి తప్పని తాళమ్ముల వేయుచూ నుండగా;
అనుభూతి ఉప్పొంగు ప్రతి డెందము!
మహత్తర కావ్యమే అగును కద,
తెలుసుకొంటే! 
;
@@@@@@@@@@@@@
;
కవిత - 5 
;
@@@@@@@@@@@@@@@@@
;            
            jalapaata guruwulu ;-
;
jalapaatamulalOna ; 
tuugu layabaddhatalu chUDu!
;
nistabdha prakRtiki
 nATyaalu nErpETi 
bodha guruwulu awi!

lOha jhillii parikarammulu ;
     aa urikETi jharulamdu
   toNukimchu sari kotta raaga waahinula! ;
kamchu taaLammula karamula puchchukuni
Srutiki tappani tALammula wEyuchuu numDagaa;
anubhuuti uppomgu prati Demdamu!
mahattara kaawyamE agunu kada,
telusukomTE! 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి