6, అక్టోబర్ 2016, గురువారం

ఈ రేయి గిలిగింత

సాగర సంగమ సంగీతములో ; 
శృతిగా కలిసిన వేళ ; 
జతగా కూడిన వేళ ; 
     రావోయీ చెలికాడా! 
      ఈ రేయి గిలిగింత ;   || 
;
మ్రోడు కొయ్యలు ; 
కొమ్మల చిగురులు 
వేసిన తొలకరిలో ; 
మొగ్గలు తొడిగిన మెరుపులలో ; 
సిగ్గులు విడిసిన విరుపులలో!;  
     రావోయీ చెలికాడా! 
      ఈ రేయి గిలిగింత ;   || 
;
పరుగులు తీసిన గాలులలో ; 
సరుగుడు తోటల ఆకులలో ; 
పరువులు మాసిన ఏరులలో ; 
నెలవులు తప్పిన మెలికలలో : 
     రావోయీ చెలికాడా! 
      ఈ రేయి గిలిగింత ;   || 
;
జిలిబిలి పాటల వెన్నెలలో ; 
కలకల నవ్వుల జాతరలో ; 
జరజర పాకే కాంతులలో ; 
     రావోయీ చెలికాడా! 
      ఈ రేయి గిలిగింత ;   || | 
;
=============================; 

saagara samgama samgeetamulO ; 
SRtigaa kalisina wELa ; 
jatagaa kUDina wEla ; 
   raawOyI chelikADA! 
       ii rEyii giligimta ;   || 
;
mrODu koyyalu ; kommala chigurulu 
wEsina tolakarilO ; 
moggalu toDigina merupulalO ; 
siggulu wiDisina wirupulalO!;  
   raawOyI chelikADA! 
       ii rEyii giligimta ;   || 
;
parugulu teesina gaalulalO ; 
saruguDu tOTala aakulalO ; 
paruwulu maasina ErulalO ; 
nelawulu tappina melikalalO : 
   raawOyI chelikADA! 
       ii rEyii giligimta ;   || 
;
jilibili pATala wennelalO ; 
kalakala nawwula jaataralO ; 
jarajara pAkE kaamtulalO ; 
raawOyI chelikADA! ;   || 
;
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$  
[ తేనె పాటలు ;-  tEne pATalu  ] &
[ గజల్  - జగల్ ]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి