8, ఫిబ్రవరి 2017, బుధవారం

టక టక టక టక

అక్కడెక్కడనో - అనుభవ దూరంగా - సిరిసంపదలు ;
నిధులను గుప్పిట పట్టి, తీసుకుని రావాలని ; 
saddle అధిరోహించి  
బయలు దేరాడు రాజకుమారుడు ; 
;
ప్రిన్స్ అధిరోహించాడు పంచ కళ్యాణిని ; 
కీలకం తెలుసుకోవాలి కదా, 
శోధన, సాధన తప్పవు కదా మరి!
అశ్వం పై ఎక్కాడు prince , 
టక టక టక టక .........
;
ఏడు సంద్రాలకు ఆవల ; 
ఊడల మర్రి చెట్టు తొర్రలో ఉంది కీరం ;
చిలకలోనే మాంత్రికుడి ప్రాణం ; 
పదవోయీ రాజకుమారా!
ప్రయాణం ఆపకు!  
టక టక టక టక ......

చిలకలో దుష్టుని ప్రాణం , 
పట్టు తెలుసుకో! 
పట్టు వీడకు ;; 
ప్రయాణం ఆపకు! 
టక టక టక టక .........
పచ్చనోటు తీరుతెన్నులు - 
                   కళ్ళు  క్రమ్మిస్తున్నవి ;
నోటు రూపు రేఖలు మారవచ్చు గాక ,
డిజైన్లు మార్పు చెంద వచ్చును గాక ;
ఆచరణలో ఋజుమార్గం ;
ప్రపంచ ప్రగతికి నిర్దేశితం, సదా సదా!
దేశ పురోభివృద్ధికి - 
వేసిన నీ ముందడుగుకు
ప్రజానీకం అందిస్తున్న శుభాకాంక్షలు ఇవి!
పట్టు వీడకు ;; ప్రయాణం ఆపకు! prince!
టక టక టక టక .........
కిరీట ధారిణి , పంచకళ్యాణీ 
టక టక టక టక
;============;
;
                           kawita ;- 

akkaDekkaDanO - 
anubhawa duuramgaa - 
sirisampadalu ;
nidhulanu guppiTa paTTi, tiisukuni rAwaalani ; 
bayludEADu raajakumaaruDu ; 
prince adhirOhimchADu pamchakaLyaaNini ; 
keelakam telusukOwAli kadaa, 
SOdhana, saadhana tappawu kadaa mari!
aSwam , 
Taka Taka Taka Taka .........
;
EDu samdraalaku aawala ; 
uuDala marri cheTTu torralO umdi keeram ;
chilakalOnE maamtrikuDi prANam ; 
padawOyii raajakumaaraa!
prayANam aapaku!  
Taka Taka Taka Taka ......
chilakalO dushTuni prANam , 
paTTu telusukO! paTTu wIDaku ;; 
Taka Taka Taka Taka .........

pachchanOTu teerutennulu - 
kaLLu  krammistunnawi ;
nOTu ruupu rEKalu maarawachchu gaaka ,
Dijainlu maarpu chemda wachchunu gaaka ;
aacharaNalO Rjumaargam ;
prapamcha pragatiki nirdESitam, sadaa saadaa!
dESa purOBiwRddhiki - 
wEsina nee mumdaDuguku
prajaaneekam amdistunna SuBAkAmkshalu iwi! 
Taka Taka Taka Taka .........;

**********************************;

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి