27, ఫిబ్రవరి 2011, ఆదివారం

బొమ్మ, బొరుసు, ఆశా ఇరుసు























మధు మాధుర్యాలను దూసి పోసిన
కిన్నెరల ఆలాపనా గానాలు;
దివి నుండి జారి వచ్చి;
సుతారంగా దూరి పోయి
నీదు కొంగు బంగారముగా మారి పోయాయి
కోమలీ! కాస్త దయ ఉంచి ;
నీ చెంగు ముడి విప్పవా?
“ పొడుపు కథ నీ నవ్వు “-
కాస్త కరుణించి ,ముడి విప్పవా?

పసిడి నాణెమ్ము అందుంది ;
ఇటు జారి ;
నా హృదయమ్ము పై పడెను;
“ బొమ్మ” పడితేను నాదు భాగ్యమ్ము;
నీ చరణ పద్మాల “ పద్మ రేఖను ఔతాను నేను”
అటు గాక ;
“ బొరుసు ” గా పడితేను;
నిను గూర్చినట్టి భావనా చక్రాల శిథిలాలలోన;
కూరుకు పోయినట్టి ‘
“ఆశా ఇరుసునే ఔతాను తథ్యమిది ,సుమ్మీ!!

&&&&&&&&&&&&&&&&&&&&&











bomma, borusu, aaSaa irusu
______________________

madhu maadhuryaalanu dUsi pOsina
kinnerala aalaapanaa gaanaalu;
divi nuMDi jaari vachchi;
sutaaraMgaa dUri pOyi;
nIdu koMgu baMgaaramugaa mAri pOyaayi.
kOmalI! kaasta daya uMchi ;
nI cheMgu muDi vippavaa?
“ poDupu katha nI navvu “-
kaasta karuNiMchi ,muDi vippavaa?

pasiDi naaNemmu aMduMdi ; iTu jaari ;
naa hRdayammu pai paDenu;
“ bomma” paDitEnu ; naadu Baagyammu;
nI charaNa padmaala “ padma rEKanu autaanu nEnu”
aTu gaaka ; “ borusu ” gaa paDitEnu;
ninu gUrchinaTTi BAvanaa chakraala SithilaalalOna;
kUruku pOyinaTTi ‘
“ASA irusunE autaanu tathyamidi, summI!

&&&&&&&&&&&&&&

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి