27, ఫిబ్రవరి 2011, ఆదివారం

వెర్రి మాలోకము














స్వప్న పుష్పాల నుండి రాలుతూన్న;
పుప్పొడి రేణువుల జలపాతాల ఉఱవడిలో;
నిరంతర స్నానాల క్రీడాభిషిక్తుడనౌ;
భాగ్య శాలిని కదా! నేను- :

“ఆహా! వెఱ్ఱివాడు వీడనుచూ” ;
వీడక నను గేలి సేయు
ఈ ప్రపంచపు చూపులకు;
నా స్వప్న స్వర్గ లోకపు ద్వార బంధపు
నగిషీ మెరుపులలోని
అతి స్వల్ప శకలమైనా దొరుకునా?
అపరంజి రంజిత అందలములో నెలకొనిన;

విస్తృత భావ కిరణ ద్యుతి వలయపు;
చుట్టు కొలత ఎంతో ;
ఆ లోక దృక్కులకు ఊహలైనా అందదు కదా!
మరి ఈ లోకము
ఒక మాలోకము - అను మాట
సత్యమే కదా! మిత్రమా!
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

























Verri maalOkamu
-----------------------

svapna pushpaala nuMDi raalutUnna;
puppoDi rENuvula jalapaataala u~ravaDilO;
niraMtara snaanaala krIDABishiktuDanau;
BAgya SAlini kadA! nEnu- :
“AhA! ve~r~rivaaDu vIDanuchU” ;
vIDaka nanu gEli sEyu
I prapaMchapu chUpulaku;
naa svapna svarga lOkapu dvaara baMdhapu
nagishI merupulalOni
ati svalpa Sakalamainaa dorukunaa?
aparaMji raMjita aMdalamulO nelakonina;
vistRta BAva kiraNa dyuti valayapu;
chuTTu kolata eMtO ;
aa lOka dRkkulaku
Uhalainaa aMdadu kadaa!
mari I lOkamu
oka maalOkamu - anu maaTa
satyamE kadaa! mitramaa!

$$$$$$$$$$$$$$$$$$$$$$$

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి