24, ఫిబ్రవరి 2011, గురువారం

రంగుల తడి
















నీ నవ్వులనూ, నీ కన్నులనూ
నీ లాలిత్యాన్నీ, నీ నిర్లక్ష్యాన్నీ
అలవోకగా చిత్రించిన
ఈ కుంచెలకు అంటి ఉన్న "రంగుల తడి" ఎన్నటికీ ఆరదు;
తర తరాలకూ
సహృదయుల వ్రేళ్ళకు చేరి,
మణుల వోలె ఆ వర్ణాలు,
అంగుళీ హేమ హారాలలో
ఈ వన్నెల తూలికల రమ్య హేలలు
అరమరికగా ఉంటూనే ఉంటూన్నాయి, ఇందు బింబాననా!
సదా, సర్వదా
ఈ చిత్ర రచనా హంస తూలికల విన్నాణపు తానాలు -
"ప్రేమ తత్వము"లోని 'అపురూపతా దనమున 'కు
సర్వ కాల నిదర్శనలు, సర్వజ్ఞత్వపు భాష్యములు

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$



















nI navvulanU, nii kannulanU\
nI laalityaannI\ , nI nirlakshyaannI\
alavOkagA chitriMchina
I kuMchelaku aMTi unna
"raMgula taDi" ennaTikI aaradu\
tara taraalakU\ sahRdayula vrELLaku chEri\
maNula vOle aa varNaalu, aMguLI hEma haaraalalO
I vannela tUlikala ramya hElalu
aramarikagaa uMTUnE uMTuunnaayi,
iMdu biMbaananaa!
sadaa, sarvadaa -
I chitra rachanaa haMsa tUlikala
vinnaaNapu taanaalu -
"prEma tatvamu"lOni 'apurUpataa danamuna 'ku \
sarva kaala nidarSanalu,
sarvaj~natvapu BAshyamulu

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి