6, జనవరి 2011, గురువారం

విశాలాక్షి వాలు చూపుల కతలు [5]నాలోన నిరతమ్ము ;
ఇందు బింబానన జ్ఞాపకముల కెరటాలు;
ఆ తరంగాల తేలాడు సతతమ్ము ఆ మిల మిలలు ఏమిటో?!

కాంతా మణి క్రీ గంటి చూపులు ఈ జలములందున
కార్తీక దీపాలుగా వెలసెను;

నీలాల నింగిలో తారకలు అగణితములు ;
వెల తెలా బోతూన్న అంబరపు చుక్కల్లు ;
నా భామ దృక్ కాంతులిట తేలాడ కనుగొనెను;

నా హృదయ సరసులందున
చెలి చూపు మిల మిలలు ఉన్నవనీ;
కనుగొనిన కొక్కోటి చుక్కల్లు
మీనాక్షి వీక్షణమ్ముల
జ్యోతులను
‘బ్రతిమాలి, బామాలి ;
తళుకులను చేబదులు తెచ్చుకున్నాయి;

ఆ నాటి నుండి; నక్షత్ర రాసులు;
అంబరమ్మందున స్థిర వాసులైనాయి;
ఆ నాటి నుండి; అవి
సౌందర్య సామ్రాజ్య శాసన కర్తలై ;
మృదు హాసముల విలసిల్లుతునాయి;

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


ఇన్నిన్ని వింతలను కనుగొనెను చంద్రుడు;
తారకా పతియై తాను దర్పమును కురిపించు;
తారా శశాంకుడు , రాకా సుధా కరుడు
ఉదయించు ప్రతి పొద్దు;
ఔను సుమా! నవ్యమౌ పొడుపు కథ!
ఈ కథల ముడులను విప్పవోయి, ఓ మన్మధుడా!
జాబిల్లి కడ-
బేలగా, తెలబోయి చూసేను మదనుండు;అతనుడు;

మరుని తెలి చూపులే....... ;
కావ్య సరసుల తేలుచూ, విరిసేటి తెలి కువలయాలు (కలువలు);

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి