24, జనవరి 2011, సోమవారం

ఇంద్ర ధనుసు విహంగము


















పాల సంద్రపు అలల నురుగులు;
తటాలున అందులోన వాలిన(ట్టి)
"హరి విల్లు పిట్ట లాగున"
నా "హృదయ సాగర సామ్రాజ్యంలో ;
అడుగిడినావు,

ఓ తరుణీ! ;
ఈ తరగలు,
ఆటు పోటులను ఎరుగవు;
అలుపు సొలుపులను ఎరుగవు;
లలనా! విశాలంగా పరచుకున్న ;
నీ పక్షముల ఈకల సందిటిలో;
నా మానస అంబుధీ కెరటాల,
తెలి నురుగులను ;
కాస్తంతైనా - పుణికిపుచ్చుకోవమ్మా!

[ ఇంద్ర ధనుసు విహంగము ;
______________ ]






















iMdra dhanusu vihaMgamu ;
________________________

paala saMdrapu ala nurugulu;
taTAluna aMdulOna vaalina(TTi)
"hari villu piTTala laaguna"
naa "hRdaya saagara saamrAjyaMlO ;
aDugiDinaavu,

O taruNI! ;
I taragalu,
ATu pOTulanu erugavu;
alupu solupulanu erugavu;
lalanaa! viSAlaMgaa parachukunna ;
nI pakshamula Ikala saMdiTilO;
naa maanasa aMbudhii keraTAla,
teli nurugulanu ;
kaastaMtainaa - puNikipuchchukOvammaa!

వర వర్ణిని కర అంగుళులు
















కొబ్బరాకుల గుండా
జారుతూన్న వెన్నెలలు; ;
ఉర్వీ తలము పైన
ఆ చక్కని చిక్కని నీడలు;

ఆకులు,
నీ చివురంటి లేత వ్రేళ్ళల్లే
ఉన్నాయని-
నారికేళ తరువునకు
కడు మోదము కలిగేను,
కనుగొనుమా!
వర వర్ణినీ!

&&&&&&&&&&&&&&&&&

16, జనవరి 2011, ఆదివారం

నా భావాలు,చెలికి బానిసలు ;













నా భావాలు,చెలికి బానిసలు
చెలి కడ " చిత్తం" అనడమే
నా భావాల పని!

ఇంతి చిత్తమెరిగినట్టి ;
లోకజ్ఞతా ప్రజ్ఞ వానిదే సుమీ!వానిదే!
బహు ప్రేమ భావాల పందిరిలొ
కల్లోల మానసమ్ములార!
స్వస్థతను పొందండి!

మెరుపుల, వెన్నెలల Stage























నా స్వర్ణ స్వప్నాలు నాట్యాలు చేసేను;
నా కలల నటనలు
శత కోటి సౌదామినులకు
ఆలవాలము ఆయె!
అనవరత నాట్యాలు సాగేటి సీమలకు
నిర్వచన పట్టికలు మీరే కద!!

వెన్నెలల వేదికలారా!/ ర!
మదీయ తరుణి తలపుల కథా కళి –
ఇచట సాగుతూ ఉండును
పులకాంకురమ్ముల తనివి తీరగ
మీరు తరియించుడీ! ;

13, జనవరి 2011, గురువారం

నా మది నర్తన శాల


జలజ లోచనీ! ;
నా మనస్సు ;
వలపు జావళీ పదములకు;
నీ చిరు నగవే;
రాగము, తానము, పల్లవిలు;
నర్తన సేయుము ప్రియ సఖియా!
నా మది నర్తన శాల కదా!
అది- నీదు -
ప్రేమ " భావ భవ వేద “ వేదిత
నాట్య హేలలకు అంకితము!
నాదు -
సుధా స్వప్నముల నైవేద్యములను ,
రతీ దేవికి,మదన దేవునికి
అందించు వేదికయె! కనుగొనుమా !

(వలపు జావళీ పదములు)

Photo at : Devayani

10, జనవరి 2011, సోమవారం

స్వప్నాలకు పునర్జన్మలు


























“వేకువ” లో “మెలకువ” ఉద్భవిస్తుంది! ;
వనరుహ నయనీ!
ప్రతి “రేయి”లో
స్వప్నాలకు పునర్జన్మలు లభిస్తూనే ఉన్నవి :
అప్పటిదాకా జోగుతూన్న నిద్రిత స్వప్నాలు ;
నేత్రాలను విప్పార్చి ; కేరింతలాడ్తూంటాయి:
నీ హేతువుల పుడమిలో
జనిస్తూన్న కారణాన
ఆ కలలన్నీ పావన చరితార్ధములే ఔతూన్నాయి కదా!
ఆ తీపి కలలు అంటూన్నాయి కదా,
తన నిత్య నూతనత్వాన్ని
" ప్రేమ - మరల ప్రేమ లోనే సతతమూ
సంతరించుకుంటూనే ఉంటుంది;
ఈ ఎడ తెగని పౌనః పున్యత
నిరంతరంగా కొన సాగుతూనే ఉన్నప్పటికీ;
ఏ మాత్రమున్నూ విసువు పుట్టించని
దార్శనిక అనుభూతియే కదా అది మరి!!
ఔనా! చెలియా!

6, జనవరి 2011, గురువారం

మమతల శక్తికి అంచనా [ 6 ]


శశాంక శీతల కిరణాలు ;
చలువ రాతి వేదికలను
రజత సింహాసనంగా మార్చాయి ;
మార్తాండ కాంతులు
నా నేత్రాల
ను ప్రమిదలుగా మలిచినవి

ప్రకృతిలోని - చిన్ని చిన్ని వస్తువులే
ఇంతటి శక్తిని కలిగి ఉన్నప్పుడు ;
అత్యద్భుత ప్రేమ భావనలకు గల శక్తిని
అంచనా వేయ గలరా? ఎవరైనా?

+++++++++++++++++++++++++++

SaSAMka SItala kiraNAlu ;
rajata siMhaasanaMgaa maarchaayi ;
chaluva raati vEdikalanu ;
maartaaMDa kAMti ,
naa nEtraalanu ; pramidalugaa malichinavi ;
prakRtilOni - chinni chinni vastuvulE
iMtaTi Saktini kaligi unnappuDu ;
atyadButa prEma BAvanalaku gala Saktini
aMchanaa vEya galaraa? evarainaa?

++++++++++++++++++++++++++++

విశాలాక్షి వాలు చూపుల కతలు [5]































నాలోన నిరతమ్ము ;
ఇందు బింబానన జ్ఞాపకముల కెరటాలు;
ఆ తరంగాల తేలాడు సతతమ్ము ఆ మిల మిలలు ఏమిటో?!

కాంతా మణి క్రీ గంటి చూపులు ఈ జలములందున
కార్తీక దీపాలుగా వెలసెను;

నీలాల నింగిలో తారకలు అగణితములు ;
వెల తెలా బోతూన్న అంబరపు చుక్కల్లు ;
నా భామ దృక్ కాంతులిట తేలాడ కనుగొనెను;

నా హృదయ సరసులందున
చెలి చూపు మిల మిలలు ఉన్నవనీ;
కనుగొనిన కొక్కోటి చుక్కల్లు
మీనాక్షి వీక్షణమ్ముల
జ్యోతులను
‘బ్రతిమాలి, బామాలి ;
తళుకులను చేబదులు తెచ్చుకున్నాయి;

ఆ నాటి నుండి; నక్షత్ర రాసులు;
అంబరమ్మందున స్థిర వాసులైనాయి;
ఆ నాటి నుండి; అవి
సౌందర్య సామ్రాజ్య శాసన కర్తలై ;
మృదు హాసముల విలసిల్లుతునాయి;

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


























ఇన్నిన్ని వింతలను కనుగొనెను చంద్రుడు;
తారకా పతియై తాను దర్పమును కురిపించు;
తారా శశాంకుడు , రాకా సుధా కరుడు
ఉదయించు ప్రతి పొద్దు;
ఔను సుమా! నవ్యమౌ పొడుపు కథ!
ఈ కథల ముడులను విప్పవోయి, ఓ మన్మధుడా!
జాబిల్లి కడ-
బేలగా, తెలబోయి చూసేను మదనుండు;అతనుడు;

మరుని తెలి చూపులే....... ;
కావ్య సరసుల తేలుచూ, విరిసేటి తెలి కువలయాలు (కలువలు);

ప్రణయ అర్చనా కావ్య మాలిక [ 4 ]








“అలుక మానుము!”
అనుచు నిను వేడ బోను....
వేకువకే “భాష్యాలు చెప్పే”
నీ నేత్రాంచలాలోని ,
పొల అలుకల మెలకువలకు
“సహస్ర దళ నళినమ్ములే – దాసోహం!”
అంటూన్న తరుణాలు,

ఆ మధుర క్షణాల కువ కువలు!!
నీ కినుకలు ఒసగిన కానుకలే గదా!










కుముదవల్లీ!
నీ సోగ చూపులు/ల ఎగ
జిమ్ము సెగలలో ;
“ నా శోషణమ్ములు” ;
నిర్వచన పదాళిగా మెలిపి, మలిచి,
కొంగ్రొత్త కార్య భారమ్ముల
ను
నీ భుజముల పైన ఉంచుకొనుము,
భామినీ! ;
అది...
"వలపు అర్చనా కావ్యమందున
‘స్వర్ణాక్షర స్థగితమ్ముగా పూని,పూన్చి
ఒనరించుమో పూర్ణేందు బింబాననా!
వలపు అర్చనా కావ్యమ్ములందున ;
ఇదె ఆన!

సవా లక్ష గొంతెమ్మ కోర్కెలు [ 3 ]























యుగ యుగాలుగా ;
తపసు చేసాను నేను! ;
ముక్కోటి, కొక్కోటి వరముల పట్టిక(list)ను చే(త)దాల్చి!
ముక్కోటి దేవతలు సాక్షాత్కరించారు!

కానీ...
సవా లక్ష గొంతెమ్మ కోర్కెలను ;
వదలి వైచాను, జవ్వనీ!

మనలో మన మాట!
ఇక పైన నాకు ;
అలవి మాలిన అభిలాషలను, కోర్కెలను ,
ఏకరువు పెట్టేటి , అక్కరయె లేదు ;
నీ చిన్ని చిరు నవ్వు , దొరికిందిలే! చెలీ!
అది కదా అతి రహస్యం!!

5, జనవరి 2011, బుధవారం

సుభద్రమే సుదతి [ 2 ]






















నా కంటి పాప –
నిను , అనయమ్ము మోయుచుండును చెలీ!
నే కను రెప్పలను మూసి, కునుకు తీసేటి వేళ ;
నా నిదురమ్మ డోల – నిను
శిశువుగా ఒడి చేర్చు కొనునులే! ;

మారాము చేస్తూ, మరి ఉండనంటూ –
నువు, ఊయెలను దిగి పోయి ;
దోగాడి వెళితేను ;
మోకాళ్ళు, సేతులు, ఒళ్ళు ;
గీసుకుని, బాధించు గాయములు ఔననుచు ;
నాకు అంతు లేనంత భీతి ఆయేను ;

అందుకే, నా రాణి! ;
నా కలల పువు రేకులను నింపి,ఇంతి
పరిచాను దారంట ఒత్తుగా మెత్తగా!
నీ గమనమ్ము ఎప్పుడూ
సుభద్రమే సుదతి!తెలుసుకొనుమా!

అనురాగ భావనలకు గల శక్తిని అంచనా వేయ గలరా?













శశాంక శీతల కిరణాలు
రజత సింహాసనంగా మార్చాయి
చలువ రాతి వేదికలను
మార్తాండ కాంతి
నా నేత్రాలను
ప్రమిదలుగా మలిచింది
ప్రకృతిలోని,
చిన్ని చిన్ని వస్తువులే
ఇంతటి శక్తిని కలిగి ఉన్నప్పుడు
అత్యద్భుత ప్రేమ భావనలకు గల
శక్తిని అంచనా వేయ గలరా? ఎవరైనా?

+++++++++++++++++++++++
SaSAMka SItala kiraNAlu ;
rajata siMhaasanaMgaa maarchaayi ;
chaluva raati vEdikalanu ;
maartaaMDa kAMti ,
naa nEtraalanu ;
pramidalugaa malichiMdi ;
prakRtilOni,
chinni chinni vastuvulE
iMtaTi Saktini kaligi unnappuDu ;
atyadButa prEma BAvanalaku gala Saktini
aMchanaa vEya galaraa? evarainaa?

+++++++++++++++++++++++++++