19, ఆగస్టు 2015, బుధవారం

మనసు తోట

ఎరుపువన్నెల వొలుకుచున్నవి;
ఇందువదన బింబాధరములు ;
గీతమ్ముల ఆలాపనలు సాగుచూ ఉన్నవి;
పాటలాధర, చెలియ వంపు తిరిగి యున్న పెదవుల ;
తమ్ములముల రాగార్ణవ సౌరభమధువులు ;
గీంతమ్ముల ఆలాపనలు సాగుచూ ఉన్నవి;
;
తరుణీమణి! నీదు తాంబూలవిడియపు జల్లులు;
నాదు మానసోద్యానవనముల తొణికిసలాడేను;
వియ్యమందేను తమాల పల్లవములు;
నాదు స్వప్నసంఘాల తోడ;
గీతమ్ముల ఆలాపనలు సాగుచూ ఉన్నవి;
;
ఇట, ఉభయసంధ్యల అరుణార్ణవములు;
పగలుకు, రేయికి; అభేదములాయెను;
శత్రులకైనా మైత్రిని కూర్చెడు చమత్కారము;

అందులకే -
నీదు హస్తమున తమాలవిడియాలకు,
నాదు ఎడద తోటను;
విడిదిగా ; అంకితమొసగితిని;
తృణీకరించకుము; జవ్వనీ!
=================

1 వ్యాఖ్య:

  1. Spice andhra ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగా వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, interviews, దేవుని కతలు, పంచాగాలు మరియు అన్నీటి గురించి తెలుసుకొవచ్చు

    ప్రత్యుత్తరంతొలగించు