28, ఆగస్టు 2015, శుక్రవారం

చెలి స్పర్శ

ఏమి ఇటుల నేడు
సిగ్గులమొగ్గ అగుచుండె;  
తెలిసినది కారణమ్ము!  
కనులకు గంతలు కట్టుకుని  
పద్మదళనేత్రి, రాజీవలోచని;
  
దోబూచులాడుచున్నది తరళాక్షి, 
గాలిలోన చేతులను; 
అటు ఇటు విసరుచు, చెలుల ;  
చటుకున పట్టుకొన నుంకించుచున్నది
సుమగాత్రి కరకమలముల స్పర్శ కలుగగానె; 
;
వడగాడ్పులున్నూ తన స్పర్శ వలన 
మలయ శీతల తుషారతప్తమ్ములాయేను; 
;
అంగనామణులందరును చేరి 
గుసగుసల, ముసిముసినగవులతొ   
నవ మోహనాంగికి, ఇందువదన ఒడలుకు 
నలుగుపిండిని పెట్టి, మేనెల్ల అలదేరు;
సురభిళ లేపనమములు  పట్టించుచుండగా; 
చకిలిగింతలు కలుగ మెలికలు తిరుగుచూ 
కిలకిలా నవ్వులను చిందించు నా సఖియ! 
చెలి కదలికల వలన,
చెలి చేతలవలన
చెలి చేతనల వలన
చెలి స్పర్శ వలన 
చిరుగాలి మారేను నవమోహిని బాణిగా!
ముగ్ధ వోలె మలయ సమీరమ్ము ఇపుడు- 
నవవధువు ఆయెను;
కొత్తపెళ్ళికూతురుకు ఆ మాత్రం, 
నునుసిగ్గు తెరల; 
మేలిముసుగులను; 
ధరియించు ఇంపులే అవి; 
ఔనా!? ఔనౌనా!?
 ====================================      

 kaTikachiikaTi amaawaasya niSini kUDa ;
kuwalayaadulu rinawi;కోమలి ! / niidu  
dara haasamulu chimdimchuchunnadi- 
waalukanula kriigamTi chuupulu wisaruchunnadi 
 taanu;  jawwani wiikshaNamula ; 
nunulEta kaamti walana; tOyajaakshi ; haasini  

nagawulamdali; wimalakaamti/  
2] Emi iTula nEDu; 
siggulamogga aguchumDe;  
telisinadi kaaraNammu!  
dObuuchulaaDuchunnadi taraLAkshi, 
kanulaku gamtalu kaTTukunnadi; gaalilOna 

chEtulanu; aTu iTu wisaruchu, chelula ; 
chaTukuna paTTukona 

numkimchuchunnadisumagaatri 
karakamalamula sparSa kalugane; 
waDagaaDpulu saitamu 
;   malaya SItala tushaarataptammulaayenu; 
amganalu oDaluku nalugupimDini 
paTTimchuchumDagaa; chakiligimtalu kaluga; 
melikalu tiruguchuu nawwulanu 

chimdimchu; mugdha wOle ; 
malaya samiirammu ipuDu- 
nawawadhuwu aayenu;
kottapeLLikuuturuku 
aa maatram, 
nunusiggu terala; 
mElimusugulanu; dhariyimchu 
impulE awi; aunaa!? aunaunaa!? 

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
 Emi iTula nEDu; siggulamogga aguchumDe; 

తెలుగురత్నమాలిక
Pageview chart 4723 pageviews - 138 posts, last published on Aug 23, 2015

'''''''''''''''''''''''''''''' 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి