29, ఆగస్టు 2015, శనివారం

తాంబూలచర్వణము

ఎరుపువన్నెల వొలుకుచున్నవి; 
ఇందువదన బింబాధరములు ; 
గీతమ్ముల ఆలాపనలు సాగుచూ ఉన్నవి;

పాటలాధర, చెలియ వంపు తిరిగి యున్న పెదవుల 
తమ్ములముల రాగార్ణవ సౌరభమధువులు 
గీతమ్ముల ఆలాపనలు సాగుచూ ఉన్నవి

తరుణీమణి! నీదు తాంబూలవిడియపు జల్లులు
నాదు మానసోద్యానవనముల తొణికిసలాడేను; 
వియ్యమందేను తమాల పల్లవములు; 
నాదు స్వప్నసంఘాల తోడ; 
గీతమ్ముల ఆలాపనలు సాగుచూ ఉన్నవి;

ఇట, ఉభయసంధ్యల అరుణార్ణవములు; 
పగలుకు, రేయికి - అభేదములాయెను;
శత్రులకైనా, మైత్రిని కూర్చెడు చమత్కారము; 
అందులకే - 
నీదు హస్తమున తమాలవిడియాలకు, 
నాదు ఎడద తోటను; 
విడిదిగా ; అంకితమొసగితిని; 
తృణీకరించకుము; జవ్వనీ!
 [ తాంబూలచర్వణము = కిళ్ళీ ]
============================   

erupuwannela wolukuchunnawi;  
imduwadana bimbaadharamulu ;  
giitammula aalaapanalu saaguchuu unnawi; 

paaTalaadhara, cheliya wampu tirigi yunna 
pedawula ; tammulamula raagaarNawa saurabhamadhuwulu ; 
giitammula aalaapanalu saaguchuu unnawi;

taruNImaNi!niidu taambuulawiDiyapu jallulu; 
naadu maanasOdyaana wanamuల toNikisalADEnu;  
wiyyamamdEnu tamaala pallawamulu; 
naadu swapnasamghAla tODa; 
iTa, ubhayasamdhyala aruNArNawamulu; ;
pagaluku, rEyiki; abhEdamulaayenu; 
Satrulakainaa, maitrini kuurcheDu; 

chamatkaaramu; 
amdulakE - niidu hastamuna tamaalawiDiyaalaku, 
naadu eDada tOTanu; wiDidigaa ; 
amkitamosagitini; tRNIkarimchakumu; jawwanI!

 ::::::::::::::::::::::::::::::::::::::::::::::: 

{{{{{{ F. B.:- 
Kusuma Piduri‎sahitheeseva (సాహితీ సేవ)
August 18 at 7:50pm · 
ఎరుపువన్నెల వొలుకుచున్నవి; :-}}}}}

 [ తాంబూలచర్వణము = కిళ్ళీ [F. B. :- LINK ]  ; 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి