అంబరానికి తెగ అసూయ చెలీ!
నీదు కపోలముల దర్పణముల చూచి,
ఎంతొ ఈర్ష్య పడి ఆ అంబరము;
"అంత మిసిమి నిగ్గుల అద్దముగ;
నేను కూడ అవ్వాలని"
తలచింది, సరే!
తలచినదే తడవుగా ;
చతుర్ముఖుని గూర్చి,
చిరకాలతపస్సు చేయడం
మొదలెట్టింది;
ఆరంభం అదె పాపం!
తుది ఎరుగని ఆచరణగ,
మారిందీ ఆ తపస్సు!
ఒంటికాలి మీద నిలిచి,
నాటినుండి నేటి దాక
పాపమటులె నిలిచి నిలిచి,
నిలిచి నిలిచి,నిలిచీ ,........
తాను వంగిపోయె నో సఖీ!
{మధుర కవితలు - 1 - కుసుమాంబ }
Kusuma Piduriభావుక ; July 22 at 11:40pm ·
(భావుక; in Face Book }
==========================
అంబరానికి తెగ అసూయ
#ambaraaniki tega asuuya:-
ambaraaniki tega asuuya chelii!
niidu kapOlamula darpaNamula chuuchi,
emto Irshya paDi aa ambaramu;
amta misimi niggula addamuga;
nEnu kuuDa awwaalani;
talachimdi, sarE!
talachinadE taDawugA ;
chaturmukhuni guurchi,
chirakaalatapassu chEyaDam
modaleTTimdi;
aarambham ade paapam! ;
tudi erugani aacharaNaga,
maarimdii aa tapassu!
omTikaali miida nilichi,
naaTinumDi nETi daaka;
paapamaTule nilichi nilichi,
taanu wamgipOye nO saKI!
{madhura kawitalu - 1 -
kusumaamba}
; #(BAwuka}
*****************************
వలపు ఇతిహాసమునకు ఆశ్వాసములు
యుగాలు మారినా, తరాలు మారినా
మారని అంశం ఒకటున్నది,
అని ఇప్పుడు తెలుసుకొంటిని;
ప్రేమప్రభలు ప్రతిభావంతమైనవి,
నీ చూపులు, నీ నవ్వులు,
నీ పలుకులు, నీ కులుకులు ;
వలపు ఇతిహాసమునకు ఆశ్వాసములు;
ప్రణయ గీతం ప్రబంధమై ;
భాసించుచున్న ఆ హేతువును;
నే కనుగొంటిని చెలీ!
వలపు విరుల దండలు
వెదజల్లే పరిమళాలు
యుగయుగాలైనా మాయనివీ,
మారనివీ అని!
[వడ్డాది పాపయ్య బొమ్మ స్ఫూర్తి]
==========================
#yugaalu maarinaa,
taraalu maarinaa
maarani amSam okaTunnadi,
ani ippuDu telusukomTini;
prEmaprabhalu pratiBAwamtamainawi,
nii chuupulu, nii nawwulu,
nii palukulu, nii kulukulu ;
walapu itihaasamunaku aaSwaasamulu;
praNaya giitam prabamdhamai ;
bhaasimchuchunna aa hEtuwunu;
nE kanugomTini chelI!
walapu wirula damDalu
wedajallE parimaLAlu
yugayugaalainaa maayaniwii,
maaraniwii ani!
'''''''''''''''''''''''''''''''''''''
[భావుక ; fb - today ]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి