7, జులై 2016, గురువారం

అద్దమంటి మనసు

అద్దమంటి మనసు, తనది! 
మంచిబొమ్మలను నేర్పుగ ; 
అందులోన ఉంచమన్నదీ, రాణి ;
;
చూపు వలువలందున ; 
చక చక్కని ఊహల అద్దకమెంతో 
బాగుంటుందని, అన్నది.
అద్దరి ఇద్దరి తెలియని ; 
కాలాలను  కొసలంటా ; 
కొలుద్దాము - అని అన్నది నా దేవి!
;
తన చెక్కిళ్ళను 
వెన్నెల పుప్పొడులను 
అద్దినది జాబిల్లి!
;
చెలి నవ్వుల 
చేమంతుల వన్నెలద్దె ప్రకృతి!
సఖి మేనున 
ఉషారుణము నద్దినదీ 
తూర్పు దిక్కు!
ఎల్ల జగతి ; 
"అద్దకం పని" లోన ఆరితేరినది
అనురాగం, అనుబంధం - ప్రజ్ఞలివే ఓ గురుడా!
నిఖిల విశ్వమూ ఇప్పుడు 
'మమతానురాగ మేళనల - 
       రంగరింపులందున' ; 
కళంకారి కూలీలు ఐనది, 
అది అంతే! 
;
============================, 
;
kawita - 1 ;- 
addamamTi manasu, tanadi! 
mamchibommalanu nErpuga ; 
amdulOna umchamannadii, rANi ;
;
chuupu waluwalamduna ; 
chaka chakkani uuhala 
 addakamemtO baagumTumdani, annadi.
addari iddari teliyani ; 
kaalaalanu ; kosalamTA ; 
koluddaamu - ani annadi naa dEwi!
;
tana chekkiLLanu 
wennela puppoDulanu addinadi jAbilli!
cheli nawwula chEmamtula wanneladde prakRti!
sakhi mEnuna ushaaruNamu naddinadii tuurpu dikku!
ella jagati ; "addakam pani" lOna aaritErinaaru, 
anuraagam, anubamdham - praj~naliwE O guruDA!

nikhila wiSwamuu 
ippuDu 
'mamataanuraaga mELanala, 
ramgarimpulamduna ; 
kaLamkAri kuuliilu ainadi, 
adi amtE! 
;

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి