8, జులై 2016, శుక్రవారం

వారసుడు మన్మధుడు

చీకటి తెరల నడుమ ; 
ఏటి తిన్నెల పడక!!!!! 
'ఏకాంతమిదియె' అంటేను ; 
కౌగిటను నను గుచ్చి ; 
'మన నడుమ ఉన్నాడు 
మూడవ వాడు; 
కడు చిచ్చరపిడుగు!' - 
అంటూను నవ్వింది జవరాలు! ; 
;
'ఔను! సత్యం!' అని 
       నేను ఒప్పుకొంటి! 
;
సుమసరములైదు,
[ఐదు పూవుల బాణాలు, ]
చెరకు విల్లు, 
చిలుక వాహనము, 
వాని కడ ఉన్నవన్నీ ; 
కడు అలతి అగు 
లేలేత పరికర సంపుటి!! 
;
ఐననూ 
   ఆ మదనుని తండ్రి 
           శ్రీమహావిష్ణువు, పద్మనాభుండు ; 
మరి లీలావతారుడు, 
శ్రీకృష్ణమూర్తియే 
సాక్షాత్తు - ఐనపుడు - 
ఆ కొంటె లీలల వారసుడు మన్మధుడు    - 
ఆ పాటి గాలి సోకకుండా ఉండేది ఏలాగు!? 
ఓ మన్మధా! 
'అతనుడవు - ' 
ఐనాను ;[= ఐనప్పటికీ]  
ఆ లీలలకు వారసత్వము 
ఇసుమంత గైకొనక 
ఉండగలవా చెప్పు!
అందుకే, 
ఓ ఇక్షు ధనుర్ధారీ! 
అందుకోవయా 
నా లీలా నమస్సులను - 
అలవోకగా, కొంటెలీలలుగాను!  
;
================================
;
cheekaTi terala naDuma ; 
ETi tinnela paDaka!!!!! 
Ekaamtamidiye amTEnu ; 
kaugiTanu nanu guchchi ; 
mana naDuma unnADu mUDawa wADu; 
kaDu chichcharapiDugu! - 
amTUnu nawwimdi jawaraalu! ; 
;
'aunu! satyam!' ani nEnu oppukomTi! 
sumasaramu laidu ;
[aidu puuwula baaNAlu, ]
cheraku willu, 
chiluka waahanamu, 
waani kaDa unnawannii ; 
kaDu alati aprikara sampuTiyE! 
ainanuu aa madanuni tamDri 
SreemahaawishNuwu, 
padmanaabhumDu ; 
mari leelaawataaruDu, 
SrIkRshNamUrtiyE saakshaattu -
ainapuDu - 
aa komTe leelala waarasuDu manmadhuDu - 
aa pATi gaali sOkakumDA umDEdi Elaagu!? 
O manmadhA! atanuDawu ainaanu ; 
aa leelalaku waarasatwamu 
isumata gaikonaka umDagalawaa cheppu!
amdukE, 
O ikshu dhanurdhaarii! 
amdukOwayaa naa leelaanamassulanu 
alawOkagaa, komTeleelalugaanu!   
;
పౌరాణిక కళాజగతి, kaLAjagati ; [ link ]

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి