8, జులై 2016, శుక్రవారం

అచ్చెరువుల త్రుళ్ళింతలు

దీపమొకటి సూర్యునింట; 
   దీపమొకటి చంద్రునింట ; 
       ఇరు ప్రభలను గుత్తకు 
           పుచ్చుకున్న దీపమ్ము ; 
నాదు చెలియ 
     నయనద్వయినందు;  
               స్థిరవాసం పొందెనోహోహో!
;
 ==========,
;
deepamokaTi suuryunimTa;  
  deepamokaTi chamdrunimTa ; 
    iru prabhalanu 
      guttaku puchchukunna deepammu ; 
naadu cheliya 
  nayanadwayinamdu; 
    sthirawaasam pomdenOhOhO!
;
************************************,
;
మిన్ను మిణుకు తారకలు ; 
భువి వైపుకి తొంగి చూసి, 
సంభ్రమమున స్వర్గసీమ 
మందహాసిని చెలియ చిరునవ్వుల చుక్కల్లు; 
కోటాను కోట్లు ఐ, విస్తరించి, విస్తరించి, 
అగణితములు ఔతూనే ఉన్నవి; 
;
"సఖియ హాసముల నక్షత్రమాలికలు ; 
      వెలసిన ఈ పృధ్వి - నన్ను మించిపోయెను!" 
అనుకొనుచూ 
 స్వర్గసీమ సంభ్రమాల త్రుళ్ళింతలు ;
          చెప్పనలవి కానన్ని!!  
;
====================,   

;          achcheruwula truLLimtalu :-

minnu miNuku taarakalu ; 
bhuwi waipuki tomgi chuusi, 
sambhramamuna swargaseema 
mamdahaasini cheliya chirunawwula chukkallu; 
kOTaanu kOTlu ai, wistarimchi, wistarimchi, 
agaNitamulu autuunE unnawi; 
"sakhiya haasamula nakshatramaalikalu ; 
welasina ii pRdhwi - nannu mimchipOyenu!" 
anukonuchuu 
swargaseema sambhramaala truLLimtalu ; 
cheppanalawi kaananni!!
;
************************************,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి