27, జులై 2016, బుధవారం

తేజస్వినీ! స్వప్న తారకలు ఇవి!

 కవిత - 1 ;- 
నీ చిరునవ్వులలో ఏమున్నదో గాని ; 
మున్ను పాతాళ అగాధాలలో 
ఎక్కడో ఉన్న చందమామ ; 
కడలిలో నుండి పైకి ఉరికి వచ్చాడు , 
నీ మృదు దరహాసంలో 
ఏమున్నదో గాని నెలవంక  - 
ఒడలంతా పులకింతలై ; 
నిండు పున్నమిగా విస్తరించాడు ; 
మందస్మిత వదనా! 
జ్యోత్స్నా చంద్రికలను మించిన 
నీ చిరునగవుల కాంతి నుండి ; 
కొంచెం వెన్నెలను నాకూ ఇస్తావా!?  

========= ,  కవిత - 1 ;- #

nee chirunawwulalO EmunnadO gaani ; 
munnu paataaLa agaadhaalalO 
ekkaDO unna  chamdamaama ; 
kaDalilO numDi paiki uriki wachchADu , 
nee mRdu darahaasamlO 
EmunnadO gaani ; nelawamka  - 
oDalamtA pulakimtalai ; 
nimDu punnamigaa 
wistarimchADu ;
mamdasmita wadanA! 
jyOtsnaa chamdrikalanu mimchina 
nee chirunagawula kaamti numDi ; 
komchem wennelanu naakuu istaawaa!? 

*********************;
                       కవిత - 2;- 
నీలవేణీ! 
నీ కురుల తిమిర ధూళిలో ఏమున్నదో గానీ ; 
హేమంతం - మసక మంచు 
తెరల పరదాలను నీకు వేస్తున్నది , 
దిష్టి తగలనీకుండా! 
కొలనుల 
జలకాలాడి వచ్చిన వేళలలో ;
'వేకువ ' 
తడి ఆరని నిడుపాటి నీ కేశములకు ; 
సుతి మెత్తని తొలి కిరణాలతో - 
సాంబ్రాణి ధూపం వేస్తూన్నది ; 

=============================,
;                kawita - 2;- 
neelawENI! nee kurula timira dhULilO 
EmunnadO gaanii ; 
hEmamtam - masaka mamchu 
terala paradaalanu ; niiku wEstunnadi , 
dishTi tagalaneekumDA! 
kolanula jalakAlADi wachchina wELalalO ; 
'wEkuwa ' 
taDi aarani ; niDupATi nee kESamulaku ; 
suti mettani toli kiraNAlatO - 
saambraaNi dhuupam wEstuunnadi ;  - 
;
******************;*********************
కవిత - 3 ;- 

నీ చిత్తరువు మౌనంగా ; 
ఏమి ఉత్తర్వులను జారీ చేసినదో ; 
ఏమో గానీ ; 
చిత్రంగా అతనునికి ఆకారం కలిగింది ; 
కేవలం నీ బొమ్మకు ఉన్న 
మహిమలను గురించి ; 
ఏమి వక్కాణము చేయగలను నేను!? 
ఓ లేమా! వయ్యారి భామా! 
నీ దివ్య సౌందర్య వ్రత ఆచరణతోనే కదా, మన్మధుడు - 
స్వ స్వరూపమును పొందాడు! 
మదనుని ఈ వైనం , 
లోకులకు బహు విచిత్రం! 
అతిశయోక్తులు కావు, 
లావణ్యవతి! 
నీ అందచందాలకు కల ఇంతటి శక్తి!     

==========================,

kawita - 3 ;- 

nee chittaruwu maunamgaa ; 
Emi uttarwulanu jaaree chEsinadO ; 
EmO gaanI ; 
chitramgaa atanuniki aakaaram kaligimdi ; 
kEwalam nee bommaku unna 
mahimalanu gurimchi ; 
Emi wakkaaNamu chEyagalanu nEnu!? 
O lEmaa! wayyaari bhaamaa! 
nee diwya saumdarya wrata aacharaNatOnE kadaa, 
manmadhuDu - 
swaswaruupamunu pomdaaDu! 
madanuni ii wainam , lOkulaku ; 
bahu wichitram! 
atiSayOktulu kaawu, 
laawaNyawati amdachamdaalaku ; 
kala imtaTi Sakti!  #   

******************, 
 కవిత - 4 ;-       

మదికి ఆహ్లాదాన్ని కలిగిస్తూన్న 
కలల పగడాలు ; 
స్వప్న ప్రవాళాలను ;
నా దోసిళ్ళ నిండుగా ; 
నింపుము చెలీ! 
గగనం ఆవలి అంచులకు  
సాగిపోతూ వెదజల్లుతాను ; 
నింగి - ఆ కలల కళలను 
మిలమిలలాడే నక్షత్రమాలలుగా ; 
తన మేనుకు హత్తుకుంటుంది ;  

===========================,  
kawita - 4 ;-

madiki aahlaadaanni 
kaligistuunna kalala pagaDAlu ; 
swapna prawALAlanu ;
naa dOsiLLa nimDugA ; 
nimpumu chelI! 
gaganam aawali amchulaku  
saagipOtuu wedajallutaanu ; 
nimgi - aa kalala kaLalanu
milamilalADE nakshatramaalalugaa ; 
tana mEnuku hattukumTumdi ; 

 ******************;   
కవిత - 5 ;- 

తేజస్వినీ! 
నింగికి ఒసగినావు నీవు ;
స్వప్న తారకలను, 
సరే! సరే! .......................

ఇప్పుడు నా విధి - 
అంబరమును ప్రాధేయ పడి, 
                అడుగుతాను ; 
తన నుండి చేబదులుగా 
చుక్కల పూవులను 
          తీసుకుంటాను నా కలలకు 
;
నా రాణికి; పూలజడలలోన ; 
ఆ నక్షత్ర మాలికలను అల్లుకుంటాను ; 
అవి చూసుకుంటూ - 
మురిసి పోతూండడమే 
మా ప్రేమికుల వంతు కదా!

==========================,  

kawita - 5 ;- 

tEjaswinI! 
nimgiki neewu ; 
osaginaawu swapna taarakalanu,
sarE! sarE! .......... 

ippuDu naa widhi - ambaramunu 
praadhEya paDi, aDugutaanu ; 
tana numDi chEbadulugaa 
chukkala puuwulanu 
tiisukumTAnu, naa kalalaku 
[rANiki; puulajaDalalOna ; 
aa nakshatra maalikalanu 
allukumTAnu ; 
awi chuusukumTU - 
murisi pOtuumDaDamE 
maa prEmikula wamtu kadA!

ళఌౡ ళళఌౡ ళళఌౡ ళ 

1 కామెంట్‌: