
ప్రణయినిది అలవి మాలిన పరిహాస నైజము!
ఇది నిజము!
సౌందర్యవతి నీట ఈదులాడేటి తరుణాన
జల తరంగిణీ వాద్యమయ్యేను సరసు!
“నీది కొన గోళ్ళ జాల్వారు సౌదామినులు ఇవి నాల్గు పదులు,
సుదతి! నీదు కరములను ముద్దాడు పది మెరుపులు!
చరణములందుకుని, సాష్ఠాంగ పడుచుండు పది దామినుల్. ”
అని నేను చూపాను నలభయ్యి మిరుమిట్ల మెరుపులను.
పద్మముల అల్లుకొనెనా మెరుపులు ;
సూర్యుడే పడెనోయి ఆ మెరుపు జాలములోన.
చిరు అలకలను చెలియ అభినయిస్తూను,
పిడికిళ్ళు మూసుకుని నఖములను దాచుకొనె!
మెరుపులను దాచుట ఎవరి తరము!?
తెలిసేది ఎన్నటికి నా వనితకు?!
తెలియగా
నాదు ప్రణయినిది
అలవి మాలిన పరిహాస నైజమ్ము!
ఇది నిజము!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి