24, డిసెంబర్ 2010, శుక్రవారం

భావ శాఖలు











ఓ పంచ వన్నెల రామ చిలుకా!
నిర్జల ఎడారుల గుండా
ప్రచండ ప్రభంజనాల గుండా
ఎగర లేక, ఎగర లేక, ఆయాస పడుతున్నావా?
రావమ్మా!రావమ్మా!ఇటు కేసి రావమ్మా!
పచ్చందనాల సందోహ నందన వని ఇది!
ఓ ప్రేమాన్విత శుక రాణీ!
నాదు లలిత భావనా పల్లవ పూర్ణ తరు శాఖలపైన
సుంత విశ్రమించుమా! ;
పుష్ప భారాన్వితమైన
ఈ నా హృదయ లతా నికుంజ పరివేష్ఠిత పాదపపు
ఇంపు సొంపుల కొమ్మలలోన
నీ గూడును నిర్మించుకొనుమా!
******************************
bhaava SAKalu
____________
O paMcha vannela raama chilukaa!
nirjala eDArula guMDA ;
prachaMDa praBaMjanaala guMDA ;
egara lEka , egara lEka ,
aayaasa paDutunnaavaa?
raavammaa!raavammaa!iTu kEsi raavammaa!

pachchaMdanaala saMdOha naMdana vani idi!
O prEmaanvita Suka raaNI!
naadu lalita BAvanaa pallava pUrNa
taru SAKalapaina ;
suMta viSramiMchumaa! ;
pushpa BAraanvitamaina
I naa hRdaya lataa nikuMja
parivEshThita paadapapu
iMpu soMpula kommalalOna
nI gUDunu nirmiMchukonumaa!

******************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి