19, డిసెంబర్ 2010, ఆదివారం

అనాదిగా “ప్రేమ యొక్క ప్రయాణము”










































చెవి ఇక్కడే ఉన్నది
ఎంతో దూరం నుండి వచ్చే
సవ్వడిని స్వీకరిస్తూన్నది

కన్ను ఇక్కడే ఉన్నది
కనీనికల చూపులు మాత్రం
కోటి కల్పముల దూరాలలో ఉన్న
తారా గ్రహ గోళములను చేరుకుంటూన్నవి

కేవల మాత్రపు చర్మేంద్రియాలకే
ఇంతింతటి ఘన శక్తిని కలిగి ఉన్నాయి కదా!

మరి, మానవాళి ప్రాణి కోటి
హృదయాలను శాసించే
“ప్రేమ యొక్క ప్రయాణము”
ఆ అనాది అగాధాలలోని వల్మీకముల నుండీ
ఇటు, ఆ అజ్ఞాత భవిష్యత్ అనూహ్య రోదసీ దిగంచలాల దాకా
సాగుతూనే ఉంటుంది,
కొన సాగుతూనే ఉంటుంది
ఇందులో ఆశ్చర్యం ఏమునది?
అసహజం ఏమున్నది? మిత్రమా!

&&&&&&&&&&&&&&&&&&&&&&&



















chevi ikkaDE unnadi ;
eMtO dUraM nuMDi vachchE
savvaDini svIkaristUnnadi

kannu ikkaDE unnadi
kaniinikala chUpulu maatraM
kOTi kalpamula dUraalalO unna
taaraa graha gOLamulanu chErukuMTuunnavi

kEvala maatrapu charmEMdriyaalakE
iMtiMtaTi Gana Saktini kaligi unnaayi kadaa!

mari, maanavALi praaNi kOTi
hRdayaalanu SAsiMchE
“prEma yokka prayaaNamu”
aa anaadi agaadhaalalOni valmIkamula nuMDI
iTu,
aa aj~naata Bavishyat anUhya rOdasI digaMchalaala daakaa
saagutUnE uMTuMdi, kona saagutuunE uMTuMdi
iMdulO aaScharyaM Emunnadi
asahajaM Emunnadi? mitramaa!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి