తెలుగు మాటలపై మమకారం ; కొన్ని కవిత్వాలు,వ్యాసాలు,జోక్సు, కంప్యూటరు తెరపైన వేసిన బొమ్మలు,పెయింటింగ్సు....... వగైరా,వగైరా.....
23, ఏప్రిల్ 2009, గురువారం
వయోజన విద్య
తేనీలు
22, ఏప్రిల్ 2009, బుధవారం
నందమూరు (ఉంగుటూరు)
విశ్వనాథ సత్యనారాయణ తెలుగు వారికి గర్వ కారణమైన పండితుడు;చిత్రంగా అనేక విమర్శలకు, ప్రశంసలను పొందిన మహా కవి. గాంధీజి ఉద్బోధించిన "సహాయ నిరాకరణోద్యమము"లో పాల్గొని ,తన ఉద్యోగాన్ని వదులుకున్న "మాతృ దేశ స్వాతంత్ర్యాభిలాషి ఈయన"అని చాలా మందికి తెలియదు. ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి. కృష్ణా జిల్లా నందమూరులో ( అనగా నేటి ఉంగుటూరు మండలము ) ,1895లో సెప్టెంబరు 10వ తేదీన (మన్మథ నామ సంవత్సరములో, భాద్రపద బహుళ షష్టి రోజు) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జన్మించారు. తండ్రి శోభానాద్రి భక్తాగ్ర గణ్యుడు. సాధారణముగా ,తల్లి దండ్రులు 'తమ పిల్లలలోని పండిత్య ,లలిత కళాది ,విజ్ఞాన అంశాదులలో గల ప్రజ్ఞను వారి బాల్యములోనే గుర్తించ లేరు కానీ శోభనాద్రి, తన కుమరుడు 'భవిష్యత్తులో మంచి పాండిత్యమును ఆర్జిస్తాడని" గుర్తించారు. . కనుకనే " తన పుత్రుడు వ్రాయ బోవు వ్రాయ బోవు మహా కావ్య కృతిని ఈశ్వరునికే అంకితము చేసెను." శోభనాద్రి భవిష్యత్తును అవగాహన చేసుకోగల మహా ద్రష్ట " అని ఈ సంఘటన వలన తేట తెల్లమగుచున్నది. శ్రీ మద్రామాయణ కల్ప వృక్షమును " తన తండ్రి కోరిక ననుసరించి" ,"నీహార రుక్ శ్రీ మంతంబయి పొల్చు, మహా తేజో మూర్తి యగు విశ్వేశ్వరునకే " అంకితము చేసెను. శోభనాద్రి కర్మ యోగి ఐన పరమ భక్త శిఖా మణి. నందమూరులో పరమేశుని నిలిపి, నిష్కామముగా గడిపిన ధన్యుడు , మహోన్నత జీవన పథగామి శోభనాద్రి . |
Views (27) |
నాయని జలతరంగిణి
నాయని సుబ్బారావు గారు హైదరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ ఇంటి యజమానురాలి పేరు "దమయంతి ప్రతి రోజు మాదిరిగానే రోజూ, మున్సిపాలిటీ పంపు ద్వారా నీళ్ళు వచ్చినప్పుడే, అందరూ నీళ్ళను పట్టుకో వాల్సి వచ్చేది. యధా ప్రకారం బిందెలతో, కడవలతో అక్కడి పోర్షన్లలో నివసించే వాళ్ళు జల యజ్ఞ సాధన కొరకై వచ్చి ఉన్నారు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు మంచి నీళ్ళు పట్టు కుంటున్నారు. ఇంతలో నెమ్మదిగా owner దమయంతి వస్తూంటే, అందరూ ఆమెను పలకరించారు. నాయని అన్నారిలాగ, చమత్కారంగా "నల్లా మహారాజు కోసరం దమయంతి వస్తున్నారు." పంపు, కొళాయి, కుళాయి, నల్లా ఇత్యాది పర్యాయ పదాలలో, ఆ జల వాహకమును తెలంగాణా జిల్లాలలో "నల్లా"అని అంటారు.
|
Baala
నిధి
![]() ఓమ్ నమః శివాయ! అచ్చులతో అద్దకాలు సరిగంచులు నేసి మేము ఇస్తాము చదువన్నది 'నిధి మూట' గైకొనరా ఓరన్నా! 1)మంచె పైన రైతన్న ! పలక పట్టుకున్నాన్న వడిసెల ఒక చేత బలపం ఒక చేత వడి వడిగా విద్యలన్ని నేర్చి తీరుతానంటూ ప్రతిన పట్టి,తన ఒట్టుకు "శ్రీ కారం"చుట్టాడు// 2)అజ్ఞానం తిమిరాలను తూర్పార బట్టాడు తప్పొప్పుల తప్ప తాలు గాలి కెగిరి పోతాయి ఉల్లాసం నింగి కెగయ విజ్ఞానం ధాన్య రాశి గొని పోవును ఇంటికి // |
Pramukhula Haasyam
మాటలకు పిసినారి
మధునాపంతుల సత్యనారాయణ ఆంధ్ర సాహిత్య రంగములో ఎనలేని కృషి చేసిన వ్యక్తి. తెలుగు సారస్వత సేవ ఆయనకు గుర్తింపునుతెచ్చింది. 1993 మార్చ్ 5వతేదీన ఆంధ్ర దేశ రాజధాని "భాగ్య నగరము"లో ఆయన సంస్మరణ సభ జరిగినది. చిక్కడ పల్లి లైబ్రరీలో ఆ రోజు జరిగిన "శ్రీ మధునాపంతుల సంస్మరణ సభ"లో మధునా పంతుల రచనల విన్నాణము గురించి వక్తల ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి. డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు "మధునాపంతులుగారు పదాల దగ్గర పరమ లోభి. ఆయన రాసిన పద్యాలలోనుండి, ఈ మాటని ఇక్కడ అనవసరంగా వేసారుఅంటూ తీసి వేయడానికి, ఏరి వేద్దామంటే ఏ ఒక్క పదము కూడా
|
పాపిటిబిళ్ళలు
![]() ఘుమ్మని భువి గుబాళించె.// మెరుపు దార హారాలు దేవ కన్యకల చేతుల పొరపాటున జారినవో?! వర్ష బిందు రత్న మణులు జల జల జల రాలిన విటు.// గడ్డి పూల తలల పైన పాపిటి బిళ్ళలు ఐనవి బుల్లి వర్ష బిందువులు. గంతులేస్తు, చిందులేస్తు పిల్లలు ఫక్కున నవ్విరి. |
టపా(ట) కాయలు
వేటూరి సుందర రామ్మూర్తి సినీ రంగంలో "పాటల రచయిత"గా కాలూని, లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు. గీత రచయితగా అనేక అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వేటూరికి రా సాగాయి. "మనసు కవి"గా సుప్రసిద్ధులు ఐన ఆత్రేయ గారికి అవకాశాలు సన్నగిల్లాయి. ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' దీపావళి పండుగ వస్తూన్నది. అంతటా హడావుడి సందడిగా ఉన్నది. మార్కెట్టులో ఆ ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు. పరస్పరమూ పలకరించుకున్నారు.ఆత్రేయ కావలసిన బాణసంచా కొనేసి, నిండు సంచీతో ఇంటిముఖం పట్టారు. "టపా కాయలు కొనేసారా?" స్నేహ పూర్వకముగా అడిగారు వేటూరి సుందర రామ్మూర్తి. "నా 'పాట కాయ'లన్నీ మీకే వస్తున్నాయి గదా! అందుకే ఊరికే ఖాళీగా ఉండట మెందుకు లెమ్మని, ఇదిగోండి!ఇలాగ 'టపా కాయలు' తెస్తున్నాను." అన్నారు ఆత్రేయ స్నేహ పూర్వకంగానే , సంభాషణలలోనూ పదముల అలికిడిని కలిగిస్తూ . |
Views (6) | Post Your Commen |
వందనమిదే!
![]() నిలిచిన తొలకరుల మబ్బులకు అభివాదము! అభివాదము! // పాడేటి పికములకు చివురులను ఒసగిన మామిడి తరువులకు,//అభి// పాడి పంటల అలరారేటి పల్లెల తొణికేటి మమత లన్నిటికిని //అభి// మా పల్లె జనములకు చదువులను ప్రేమతో నేర్పేటి గురువులకు అభివాదము! అభివాదము // |
కొత్త అంజనం
![]() పల్లవి: వేణు వినోదం మృదు భావ విహారం |
1) ఈలల గీతం
ఈ లలనల హాసము
సుమధుర శబ్దములాయినవి
సంగీతమునకు చిరు నామాలు
కోరస్:
ఇల్లూ వాకిలి,పల్లె పట్ణములు
రేవులు,వనములు,కోవెలలు
కళల వలయముల హరివిల్లులయేను
2)గళముల సౌరుగ జానపదాలు,
ప్రతి అడుగు జాడలును
చిందిన సొగసుల పల్లె పదాలను
3)ఇందిందివియే ఇవియే
అరువది నాలుగు కళలకు నెలవులు
Baala
పెళ్ళిపెద్ద
![]() (answer)::: ఘీంకరిస్తూ అడవికి పోతా! (ప్రశ్న) ::: అడవికి పోయి అటేమి చేస్తావ్? ( answer )::: పద్మావతినీ భయ పెడతాను శ్రీనివాసులుతొ దోస్తీ కట్టి సాష్టాంగం!దండ ప్రణామం! అమ్మకు,అయ్యకు కళ్యాణం అంగ రంగ వైభోగంగా జరిపించేస్తా! నా వీపు పైన అంబారి కట్టి వధూ వరులను కూర్చుండ బెట్టి ఊరేగిస్తా ముల్లోకములు. |
పూవు
![]() సుతి మెత్తని సుతారమీవు // మెత్తని నవ్వువు నువ్వు తావిని ఎడదను హత్తు కొందువు// రంగుల నద్ది, రేకు రేకును తురగము చేసి వెన్నెల తేరుకు, బహుమానం ఇచ్చిన దాతవు నువ్వు // బాలల జగతికి నీవే ఊహల సారధి వైనావే! కవి భావాలను నువ్వే దౌడును తీయిస్తావు // |
Recipes
జలుబు తగ్గేందుకు చిట్కా:
అల్లము రసము - చెంచాడు
తమలపాకుల రసము - రెండు చెంచాలు
తేనె - రెండు చెంచాలు
ఈ మూడిట్నీ కలపాలి. ఈ రసముల మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి త్రాగాలి. త్రాగిన వెంటనే ఒక చెంచాడునీళ్ళు తాగాలి. ఇలా చేస్తే పడిశము నుండి కొంత ఉపశమనము లభిస్తుంది.
డాక్టరు దగ్గరికి వెంటనే వెళ్ళేందుకు వీలు కుదరనప్పుడు, ఇలాటి చిట్కాలు ఆపద్ధర్మముగా ఉపకరిస్తాయి.
జ్వరంలో పాణిగ్రహణం!
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య 1889 జూన్ లోకృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో జన్మించారు. అప్పటి దాకా కందుకూరి వీరేశ లింగము మున్నగు వారి సంఘ సంస్కరణలలో వన్నె కెక్కిన ఆంధ్ర దేశము, స్వాతంత్ర్య పోరాటములో కూడా దీటు లేనిదనే ఖ్యాతిని గాంచినది. సరే! వారి జీవితములో ఒక హాస్య సంఘటన తాలూకు "రిమ రిమల"ను జ్ఞప్తికి తెచ్చుకుందాము. ఒక సారి గోపాల క్రిష్ణయ్య గారికి జ్వరం వచ్చింది. కుశల మడగుదామని దువ్వూరి సుబ్బమ్మ గారు వచ్చారు. ఆమె కూడా స్వాతంత్ర్య సాధనకై పోరాట రంగములోనికి ప్రవేశించిన అలనాటి నారీ శిరో మణి. జ్వర తీవ్రతతో "హా హా హూ హూ " అంటూ తెగ వణికి పోతున్నారు ఆ రామదండు నేత. "ఏమిటీ? జ్వరం ఎక్కువగా ఉన్నదా? ఏదీ చూస్తాను!" అంటూ చేయి పట్టుకుని నాడిని చూడసాగారు సుబ్బమ్మగారు. అంత జ్వరంలోనూ "అసలే జ్వరంతో బాధ పడుతూంటే మధ్యలో పాణి గ్రహణము కూడానా!" అని ఛలోక్తిని విసిరారు దుగ్గిరాల. |
తపము లేనిదె యెన్నరే నెపము లెల్ల!
![]() "ఆంధ్ర రత్న" బిరుదు కల దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు. కోదండ రామయ్య, సీతమ్మ దంపతులకు పుణ్య ఫలముగా పుట్టిన గోపాల క్రిష్ణయ్య "రామ దండు" సమర దళమును నిర్మించి,స్వాతంత్ర్యసయుద్ధములో తన క్రియా శీలతను నిరూపించుకొనిన ధీశాలి. అంతేకాదు! ఆయన గాయకుడు, రచయిత కూ డా! ఆ దుగ్గిరాల వారి రచనలలో ఒక వ్యంగ్య సీస పద్యమును చూడండి. కొండెంకటప్పన్న గుండు సున్న గదన్న గోపాల కిట్టాయి కొక్కిరాయి టంగుటూరు ప్రకాశ మింగిలీసు పిశాచి నాగేశ్వరుడు వట్టి నాగ జెముడు పట్టాభి సీతన్న తుట్టె పురుగు గదన్న ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు గొల్ల పూడ్వరన్న కళ్ళు లేని కబోది బులుసు సాంబడు వట్టి పుట్టు కుంక అయ్యదేవర గాడు పెయ్య నాకుడు గాడు అయ్యంకి రమణయ్య దయ్యమయ్య డాక్టర్ సుబ్రహ్మణ్య మాక్టింగ్ పులిష్టాపు దువ్వూరి సుబ్బమ్మ దృష్టి బొమ్మ తే.అనుచు పల్కుదు రాంధ్రుల నవని యందు గాంధి శ్రేష్ఠుని మతములో గలిసి నపుడు తపము లేనిదె యెన్నరే నెపము లెల్ల రామ నగరీ నరేంద్ర! శ్రీ రామచంద్ర! ఈ శతక పద్యము తొలి భాగము చదవగానే "ఇది తిట్టు కవిత్వము కామోసు!" అని అనిపిస్తుంది. "గాంధి మహాత్ముని"మతములో చేరినపుడు అందరూ అలాగ అనుకొన్నారనగానే,ఆ రచనలోని చమత్కారము చదువరికి నవ్వు తెప్పిస్తుంది. నేటి ఎన్నికల ప్రచారము హోరు గమనించండి. దూషణ భూషణ తిరస్కారములతో, తిట్టు పురా నేటి ఎన్నికల ప్రచారము హోరు గమనించండి. దూషణ భూషణ తిరస్కారములతో, తిట్టు పురాణములతో దద్దరిల్లి పోతూన్నది వాతావరణము. ఈ సందర్భములో పైన పేర్కొన్నట్టి పద్యము గుర్తుకు తెచ్చుకున్నాను! |
తలంబ్రాలు
శుభలేఖలలో కొన్ని శ్లోకములను తఱచుగా వాడుతూంటారు. వానిలో ఒక సుప్రసిద్ధ శ్లోకమును పరిశీలిద్దాము. "జానక్యనః కమలాంజలి పుటేయాః పద్మ రాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయ కాంతి కలితాయః ఇంద్ర నీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీ రామ వైవాహికః ." ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' "సీతా రామ కళ్యాణము", సంపూర్ణ రామాయణము"(బాపు దర్శకుడు) సినిమాలలో ఈ శ్లోక భావమునే ప్రేక్షకుల హృదయాలను రంజించే రీతిగా చిత్రించారు. "శ్రీ కృష్ణ లీలా తరంగిణి"లోని ద్వాదశ తరంగములో రుక్మిణీ కళ్యాణము" వర్ణించబడినది. నారాయణ తీర్ధుల వారి ఈ శ్లోకమును పఠించండి. "భైష్మ్యాః పాణి సరోరుహాంజలి గతా రక్తాస్తు ముక్తాః స్థితాః యా ముక్తా గళితాను రాగ విమలాః కృష్ణోత్తమాంగాశ్రయాః యా తా స్తస్య యదూద్వహస్య పరమం సామ్యం విశుద్ధాత్మనః తాః కుర్వంత్వభిత శ్శుభాని సతతం శ్రీ కృష్ణ వైవాహికాః." తాత్పర్యము::: ''''''''''''''''''''''''''''''' మంగళసూత్ర ధారణము జరిగినది. రుక్మిణీ కృష్ణులు ఒండొరులు తలంబ్రాలను పోసుకొన్నారు. ఆ తరుణమున రుక్మిణీ దేవి యొక్క పద్మముల వంటి ఎర్రని అఱ చేతులలో(అంజలి, దోసిలి)ఉన్నప్పుడు ముత్యాల తలంబ్రాలు" ఎర్రగా నైనవి.శ్రీ కృష్ణుని శిరసుపై నున్నపుడు ఆ మౌక్తికములు తమకు సహజమైనట్టి తెల్లని కాంతిని పొందినవి.:అనురాగము తొణికే రుక్మిణీ దేవి సామీప్యమున అవి రాగము"(= ప్రేమ, ఎర్రని రంగు) ను పొందినవి. (రాగ,ద్వేష రహితుడైన శ్రీ కృష్ణ మూర్తి సన్నిధిలో విశుద్ధ ఆత్మ), ఆ స్వామి నిర్మల హృదయమునకు సాటి రావాలని ,సామ్యమును ఆ నవ మౌక్తికములు అభిలషిస్తున్నాయి కాబోలును!అని అనిపిస్తున్నది." ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; పైన ఉన్న రెండు శ్లోకములలోని భావములలోని సారూప్యతను తిలకించారా? తెలుగు వారి గృహములలోని పరిణయ వేడుకలలో "తలంబ్రాలు నయనానందకరము కలిగించే సాంప్రదాయ కలిమి. ఈ నేత్ర పర్వము ఐన వేడుక సారస్వతము అనే మర్రి చెట్టు కొమ్మలలో అనేక పర్యాయములు ఊయలలు నిర్మించుకుని, క్రీడించి, హర్షమును కలిగించినది |
టీచరులు, కాఫీచరులు!
తెలుగు వారికే గర్వకారణమైన "అష్టావధానము"సాహితీ ప్రక్రియలో,"అప్రస్తుత ప్రసంగము"ఒక అంతర్భాగము.అవధానము కొనసాగేటప్పుడు వారిని తికమక పెట్టేటందుకు పృచ్ఛకులు లల్లాయి లొల్లాయి కబుర్లూ,ప్రశ్నలూ వేస్తూంటారు. ఆ చొప్పదంటు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటే పండితునికి కత్తి మీద సాము లాంటిదే!ద్వేదిక మీద అప్పటికప్పుడు చమత్కర భరితముగా జవాబు నివ్వగలిగివాకవి గారికి ప్రశంసలు లభిస్తాయి,ఆ సమయోచిత సంభాషణలను ,సభికులు మరల మరల గుర్తుకు తెచ్చుకుని,ఆనందిస్తూంటారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారిది అవధానములు చేయటములో అందె వేసిన చెయ్యి. అప్రస్తుత ప్రసంగముచేస్తూన్న వారి కొంటె ప్రశ్నలకు లభించే హాస్య సమాధమములలో మచ్చుకు ఒకటి. ప్రశ్న "రామబ్రహ్మం పంతులు గారూ! మీకు 'కాఫీ' ఇష్టమా?'టీ' అంటే ఇష్టమా?" అధ్యాపక(=టీచర్) వృత్తిలో ఉన్న ఆ పండిత వరేణ్యుడు బేతవోలు రామ బ్రహ్మం ఇలా అన్నారు,ఏమాత్రం తడుముకోకుండా "సోదరా! మనము టీచర్లం("టీ"చర్)కదండీ!". ఇతరులను నొప్పించని ఇలాంటి సంభాషణలు, తొణికిసలాడే హాస్య మంజరుల గుబాళింపులు ఇతరులను నొప్పించని ఇలాంటి సంభాషణలు, తొణికిసలాడే హాస్య మంజరుల గుబాళింపులు సారస్వత నందనవనములలో రసజ్ఞులు విహరించేలా చేస్తాయి. |
ఆనందో కృష్ణ!
ప్రముఖ సంచలన పత్రిక "కృష్ణా పత్రిక"కు సంపాదకులు"శ్రీ ముట్నూరి కృష్ణా రావు. ఆయన ప్రతి రోజూ ఉదయము తోటలో్ పచారులు చేస్తూ, ప్రకృతికి సన్నిహితంగా గడిపే వారు. మధ్యాహ్నం సంపాదకీయాలను సమగ్రంగా రచించడములో తలమునకలయ్యేవారు. సాయంత్రము స్నేహితులతో సంగీత చతురోక్తులతో హాయిగా కాలక్షేపము చేసేవారు. మిత్రులు ఇలా చనువుగా అనేవారు "కృష్ణా రావు గారు ఉదయం పూట 'తోటానందులు,'మధ్యాహ్న వేళల్లో 'వేటానందులు', సాయంత్రం పూట 'ఆటానందులు, పాటానందులు'." ముట్నూరి కృష్ణా రావు గారిని ఆనందో బ్రహ్మ!...కాదు! కాదు! ఆనందో కృష్ణ! అందామా?! |
Baala
చదువన్నది ఇంద్ర పదవి!
నిశానీలు, వ్రేలి ముద్ర మానాలి సత్వరమే సంతకాలు చేయాలి త్వర త్వరగా పుస్తకాలు చదవాలి మా తాతలు చదివారా? ముత్తాతలు చదివారా? అని ఎదురు ప్రశ్నలే వద్దు! విద్య లేని మొద్దులనే నానుడి నువు వినలేదా?! ఓరన్నా! చదువన్నది ఇంద్ర పదవి సంఘంలో విలువున్నది బ్రతుకు చక్కదిద్దగలుగు రహదారి విద్యయే నన్నా |
Baala
సంతసాల కోవెల
![]() తొలి పొద్దున కిరణాలు వెచ్చ వెచ్చన బుల్లి బుల్లి పిట్టలతో బులి బుచ్చకాలు బాల పాపల్లార!ఇక అల్లరంతా మనది! 1)పువ్వులన్ని విరిసాయి తుమ్మెదలు ఎగిసాయి ఝుమ్ ఝుమ్మని తిరిగాయి పులుగులతో బహు సౌరుగ - తిరుగో!తిరుగు! 2)కొమ్మ పళ్ళు పండాయి పాప కొరకు వంగాయి తేనెలూరు మిసిమి పళ్ళు అందుకొమ్మన్నాయి 3)అచ్చు, హల్లులతో పాటుగ a-b-c-d-లు రాసి భాషల అందాలన్నీ దోసిటిలో నింపేసి శ్రీశారదా దేవి కిచ్చి సంతసాల కోవెలను కట్టుదాము అందరమూ |
గాలిపటాలు
సంకురాతిరిల సంబరాలు 'ఇల'!(=భూమి) గాలి పటాలు,వన్నెలు విరియగ నీలాఅల నింగినీ ఎగరేనండీ! ఇలా.....ఇలా....... అలా,అలా,ఆలాగున! // 1)గగన మంత తన రాజ్యమంట! అచటా అచట ,అచటంతా అంతట తనే అయి చెలరేగేను // 2)అటు ఊగును,ఇటు ఊగును అందందున తారాడును తారలనే వెక్కిరించు'కొక్కిరాయి' ఈ పతంగి // 3)అంబరమున నడయాడును నడక కాదు! నాట్యము అది! మబ్బులను కొక్కిరిస్తు, రొక్కించే రాలు గాయి ఈ పతంగి // |
Views (33) | P |
చమక్కులు
1)అన్న,తమ్ముడితో ఆడుకుంటూ,సిరాను ఒలక బోసి,ఒళ్ళంతా ఖరాబు చేసుకున్నది, బేబీ. "ఐతే రోజూ నా ఫైళ్ళను ఖరాబు చేస్తూన్నది,నువ్వేనన్న మాట!హన్నా! ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డావు."తల్లి కోప్పడుతూ అన్నది. "కాదు మమ్మీ! చెల్లి (/అక్క) నీలం కలరు ఇంకును పూసేసుకున్నది." "కాబట్టి అక్క 'బ్లూ హ్యాండు'లతోటి పట్టు బడినదన్నమాట!" అమ్మ మాటను సరిదిద్దారు, ఆ సోదరులు. """"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""" 2)కుందేలు బొమ్మను వేసారు విద్యార్ధులు. డ్రాయింగు టీచరు అడిగింది "సోమూ! ఇదేంటి? రెండు "v","v" లను మాత్రమే వేసి పెట్టావు? కుందేలు ఏదీ?"చిత్ర లేఖనము పుస్తకమును చూపిస్తూ,వేసిన ఆమె ప్రశ్నకు జవాబు వచ్చింది ఇలాగ. "అవ్వి కుందేలు చెవులు, మేడమ్ ! కుందేలేమో ఆ గోడ వెనకాతల ఉన్నదన్నమాట! |
Tit Bits
ఆల్మండ్సు బాయ్!
ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ రైలు బోగీలో తమకు జరిగిన ఓ అనుభవాన్ని గ్రంథస్థం చేసారు. మాలతీ చందూర్, బెజవాడ గోపాల రెడ్డి ప్రభృతులు ప్రయాణిస్తూన్నారు. రైలు ఏలూరు దాటింది. సైడు బెర్తులో ఒక స్త్రీ ,తన మూడేళ్ళ కొడుకుతో కూర్చుని ఉన్నది.ఆమె తన కుమారునికి ఆల్మండ్సును తినడానికి ఇవ్వసాగింది. తల్లి తన చేతికి ఇచ్చిన ఆల్మండ్సులలో ఒకటి గోపాల రెడ్డి గారికీ,ఒకటి చందూర్ కీ ఇచ్చి ,ఒకటి తను తినేవాడు.ఇలాగ రెండు మూడు సార్లు జరిగినది. పరిచయాలూ, పలకరింపులలో ఆ పిల్లవాడి అమ్మ కొన్ని వివరాలు మాలతికి జ్ఞాపకం ఉండి పోయాయి. "మా బాబు పేరు పృథ్వి." "పృథ్వి స్త్రీ లింగము.అందుకని -పృథ్వీ కుమార్....పృథ్వీ పుత్ర - ఇలాగ పృథ్వికి మరో పదాన్ని జోడించాలి."అన్నారు బెజవాడ గోపాల రెడ్డి. ఆమె "పృథ్వీ చక్రవర్తి'అండీ! "వెరీ గుడ్! బావున్నది"అన్నారు గోపాల రెడ్డి గారు. ఆ తర్వాత కబుర్లలో తెలిసినది, ఆమె రామదాసు మోటార్స్ చౌదరి మనుమరాలు అనీ, ఆ బాలుడు మూవీ ఆర్టిస్టు ఐన త్రివిక్రమ రావు కుమారుడు అనీ. కొన్ని సంవత్సరాల తర్వాత "డ్రైవర్ మామ"సినిమాలోని హీరో గా ఉన్న పృథ్వీ చక్రవర్తి తటస్థ పడ్డాడు. గడ్డం పెంచడము వలన చందూరు గుర్తు పట్టలేక పోయారు , కానీ ఆమెను పృథ్వీ చక్రవర్తియే గుర్తు పట్టి , పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి ఆల్మండ్సు బాయ్ పృథ్వీ చక్రవర్తియే ,సినీ నటుడు "కళ్యాణ చక్రవర్తి". |
Views (126) | Comments (1) |
కొండల రాయుడు, అండగా
![]() అండగా ఉన్నాడు కొండల రాయుడు మాకు దండల సింగార స్వామి కోటి దండాలు నీకు //అండగా// తప్పెట్లు ఉన్నాయి తాళాలు ఉన్నాయి శ్రీ వేంకట నాథుని నామ భజన లున్నాయి //అండగా// బాజాలు ఉన్నాయి భజంత్రీలు ఉన్నాయి భువన మోహన స్వామి కీర్తనలు ఉన్నాయి //అండగా// డప్పు, దరువు లున్నాయి సన్నాయి నొక్కులున్నాయి శ్రీ శ్రీనివాస నుతులు, స్తుతులు ఉన్నాయి వేయి కోట్లు //అండగా // |
Views (99 |
గంధర్వ గానాలు!
పల్లవి ఏడు కొండలమీద అచ్చట తిరు నగరిలోన ఇచ్చట నెలతల దరహాస వల్లరి సుమ కోమలం తావులు పరి వ్యాప్తి అను పల్లవి అచ్చటలు ముచ్చటలు లోకాభి రామాయణం సిరి సిరీ! సిరి సిరీ! సిరి సిరీ! అల మంగ తాయారు వడి వడి తయ్యారు భద్రంగ ఉన్నదా? ఓరుగల్లు!?! గబగబా, గబగబా, గబగబా! వెంకన్న మది రాణి భూదేవి నడువుమా! అడుగులేస్తేనే ధరణి కందేనా!?! వడివడిగ, వడివడిగ త్వరగ, త్వరగా! తేరు రానే వచ్చెనో యమ్మలారా! పట్టు కుబుసాల కుచ్చిళ్ళలో సరిగంచ మడతల రెప రెపలలో మీ కంటి రెప్ప పాటులు టప టపా, టపటపా, టపటపా! కోరస్ మీ ఈ చిరునవ్వు సందడులు గలగలా! గలగలా, గలగలా, గలగలా! సరి సరీ! గబగబా! వడివడీ! త్వరత్వరగలూ ఇన్నిన్నిగానూ, ఈ మేళవింపులే గంధర్వ గానాలు! సన్నాయి మేళాలు ! పిప్పి ప్పి! డుమ్ డుమ్! పిప్పి ప్పి, డుమ్ డుమ్!! |
Views (8 |
కళలకు కాణా కళలకు కాణాచి
కళలకు కాణాచి ;
![]() మదన మోహన, నంద నందనం గోవర్ధన గిరి ధారీ! వన మాలీ! //కృష్ణం// (అను పల్లవి);;;;;;; ''''''''''''''''''''''''''''''''''' 2)నిన్నే తలచీ తలచీ భజనలు చేయాలీ!! //కృష్ణం// 3)చిటికెల తాళం చిడతల తాళం చిందులలోనే నాట్యాలు అహో! చిందులు నాట్య నివాసాలు //నిన్నే // |
ప్రశ్నాళి
ప్రశ్నాళి!
![]() భగవంతుని ప్రసాదమా! చరా చర జగత్తునకు ప్రాణ దానమా! నీ స్వరూప మెట్టిది? మ్రోడులలో దాగినావా? ఓ మధుర స్వప్న లహరికా! నేడెటు నుండిటు వచ్చినావు నవ్వు పువ్వు రువ్వులతో మా ఇంటిలోన కేరింతల పాపాయిగా! కరుడు కట్టియున్న మంచు కొండల లోయల నుండా? నిరుడు గిరి శృంగ |
నిరుడు గిరి శృంగములపై కెక్కి
అలిగి కూర్చున్నట్టి
జలధరాల గిట్టల జాడల నుండా?
రేయి కన్నుజాబిల్లి చూపుల
వెన్నెల సోనల నుండా?
వగలొలికే పగటి సిగల
దినమణి కిరణాళి నుండా?
సూటిగా ప్రసరించే
ఉదయ ప్రభాద్యుతి నుండా?
సృష్టి రచన చేయుచూ
ఆ భగవంతుడు
విదిలించిన కుంచె నుండి
వెలసిన హరివిల్లునుండా?
ఎచటి నుండి నీ రాక?
మాలో ఎల్లరిలో
జీవ ధాతువై నిలిచిన
అనుకోని అతిథీ!
వినువీధి
![]() |
Selayeruనిద్రా వినువీధిBy kadambari piduri, Mar 10 2009 5:57PM ![]()
|
కొత్త అంజనం
కొత్త త్త అంజనం
![]() పల్లవి: వేణు వినోదం మృదు భావ విహారం 3)ఇందిందివియే ఇవియే |